పాపం పుతిన్‌.. రష్యాకు పెరిగిపోతున్న శత్రువులు?

frame పాపం పుతిన్‌.. రష్యాకు పెరిగిపోతున్న శత్రువులు?

నాటో 30 దేశాల కూటమి ప్రస్తుతం 31 దేశాల కూటమిగా మారింది. తాజాగా నాటోలో ఫిన్లాండ్ దేశం చేరింది. అయితే ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా కారణంగా ఫిన్లాండ్ భయపడి నాటోలో చేరేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. నాటో లో ఏ దేశమైనా సభ్యత్వ దేశంగా చేరాలంటే మిగతా 30 దేశాలు అంగీకరించాలి.


కానీ ఇప్పటి వరకు ఫిన్లాండ్ చేరేందుకు తుర్కియా, హంగేరీ దేశాలు అడ్డుపడ్డాయి. ఫిన్లాండ్ రష్యాకు సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ఉక్రెయిన్ తర్వాత మా దేశంపైనే దాడులకు దిగుతారేమోనని ఫిన్లాండ్ భయపడి నాటో సభ్యత్వం కోరుకుంది. ఇన్ని రోజులు ఫిన్లాండ్ సభ్యత్వాన్ని ఇష్టపడని అమెరికా, యూరప్ దేశాలు ప్రస్తుతం రష్యాకు వ్యతిరేకంగా వెంటనే అంగీకారం తెలపాల్సి వచ్చింది.


గతంలో సోవియట్ యూనియన్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న ఫిన్లాండ్ ప్రస్తుతం తటస్థంగా ఉంటోంది. కానీ రెండో ప్రపంచ యుద్దం జరిగిన సమయంలో సొవియట్ యూనియన్ తో ఏర్పడిన అగాధాన్ని ఫిన్లాండ్ ఇంకా మరిచిపోలేకపోతుంది. ఫిన్లాండ్ తీసుకున్న ఈ నిర్ణయంతో 31 దేశాల నాటో కూటమి తయారైంది. నాటో దేశాల ఐక్యత కు మారుపేరు. ఆర్థికంగా, రాజకీయంగా, యుద్ధ పరంగా కూడా ఎక్కడ నాటో సభ్య దేశాలకు ఏం జరిగినా మిగతా దేశాలు ఆదుకోవాల్సిందే.


ముఖ్యంగా ఏదైనా దేశం నాటో దేశంపై యుద్దం చేయడానికి వస్తే మిగతా 30 దేశాలు కూడా తమ పై యుద్దం ప్రకటించినట్లు ఏకమై రణరంగంలోకి దిగుతాయి. అసలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి అసలు కారణం. ఉక్రెయిన్ నాటో లో చేరతామని ప్రకటించడం, దీన్ని గమనించిన రష్యా అధ్యక్షుడు చేరొద్దని ఉక్రెయిన్ ను హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో ఇప్పుడు యుద్దంతో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. రష్యా చేస్తున్న ఈ యుద్దం వల్లే ఫిన్లాండ్ నాటో చేరడానికి కారణమైంది. దీనికి పుతిన్ కు థాంక్య్ చెప్పకుండా ఉండలేకపోతున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: