ఆ విషయంలో ఇండియాకు అండగా అమెరికా?
కానీ అమెరికా మాత్రం దీనిపై తీవ్రంగానే స్పందించింది. మెక్ మోహన్ రేఖ ప్రకారం.. 1915 లో దీన్ని అనుసరించి ప్రపంచ దేశాల సరిహద్దులను నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం అక్కడ ఉండే భూమి అంతా భారత్ కు చెందినదేనని అమెరికా చెప్పింది. చైనా కావాలనే ఇతర దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోందని ఆరోపించింది. భారత్ కు ఈ విషయంలో అండగా ఉంటామని చెప్పింది.
చైనాకు ఇప్పటికే తైవాన్ తో సరిహద్దు గొడవ ఉంది. ఇంకా ముఖ్యంగా తైవాన్ పై యుద్ధం చేసేందుకు సిద్ధపడుతోంది. దీన్ని అమెరికా అడ్డుకుంటూనే ఉంది. తైవాన్ పై ఏ నిర్ణయం తీసుకున్నా అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగుతుందని ప్రకటించింది. అయితే డ్రాగన్ కంట్రీ తన కుటిల బుద్ధిని ఎక్కడ పోనియ్యడం లేదు. కనిపించిన ప్రతి దేశ సరిహద్దుల వద్ద అలజడి సృష్టిస్తూనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం అని కుండబద్దలు కొట్టి చెప్పింది అమెరికా.
ప్రశాంతంగా ఉన్న సమయంలో కావాలనే చైనా రెచ్చగొట్టే విధానాలను అవలంభిస్తుందని అమెరికా చైనా పై కోప్పడింది. చైనా విస్తరణ కాంక్ష వల్ల చుట్టూ ఉన్న దేశాలకు తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి. అమెరికా మాత్రం చైనా ఎక్కడపడితే అక్కడ మా భూమే అనడం సరికాదని తెలిపింది.