ఆ మూడు అంశాలే మళ్లీ జగన్‌ను గెలిపిస్తాయా?

కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నటువంటి తరహాలోనే ఏ పార్టీ గెలుపు ఓటమిలకు వంద కారణాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు విశ్లేషణతో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి శాపాల విషయం పక్కన పెడితే, జగన్ కి ఉన్న వరాలు ఏంటంటే ముందుగా లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమం అని చెప్పాలి. జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాల కారణంతో రేపు ఆయన రాకపోతే అందవన్న కారణంతో వందకు 80 మంది లబ్ధిదారులు ఆయన రావాలని కోరుకుంటున్నారు


ఇది వరకు చంద్రబాబు ప్రజల వద్దకు పాలన అన్నారు కానీ అది చేతల్లోకి అయితే రాలేదు. జగన్ వచ్చేసరికి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పాలనను సంక్షేమాన్ని ప్రజలకు అందించడంతో, ఈయన ఉంటేనే ఇవన్నీ నడుస్తాయని  ప్రజల్లో ఉంది. జగన్ అనే వ్యక్తి మాత్రమే చంద్రబాబు వర్గానికి సంబంధించిన లాభీలను ఎదుర్కోగలడు అని  కొంత మంది నమ్ముతున్నారు వాళ్ళ ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయగలడు అనే ఫీలింగ్ యాంటీ కమ్మ సమాజంలో ఉన్నదని తెలుస్తుంది.


అది పవన్ కళ్యాణ్ కి సాధ్యం కాదు, భారతీయ జనతా పార్టీకి సాధ్యం కాదని బలంగా నమ్ముతున్నారు వాళ్ళు. అదే సందర్భంలో పెద్దవాళ్లనైనా ఢీకొట్టగలిగే శక్తివంతుడనే ఫీలింగ్ వాళ్ళ యూత్ లోనే కాకుండా, ఎస్సీ, ఎస్టీ యూత్ లో కూడా బలంగానే ఉందని తెలుస్తుంది. అతి ముఖ్యమైనది ఏంటంటే యంగ్ స్టర్ ఇప్పటికే ఇన్ని చేశాడు ఇంకా ఏదో చేస్తాడు అన్నటువంటి ఫీలింగ్ కూడా ఉంది. వాళ్ళకి ఇవే ఆయనకున్న వరాలు. ఎట్ ద సేమ్ టైం ఇవే సరిపోవని చెప్తున్నారు.


అడ్మిషన్ లో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి కంట్రోలింగ్ కి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తే పాత ఉద్యోగులందరూ కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారు. నెగటివ్ ప్రచారాలు చాలా సీరియస్ గా చేస్తున్నారు అలాగే మిగతా పార్టీలన్నీ జట్టు కట్టి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్న వేళ జగన్ కు ఒక రకంగా పెద్ద పరీక్షే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: