కమ్యూనిస్టులు.. గెలవకున్నా గెలిపిస్తారా?

సీపీఐ, సీపీఎంలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయనీ.. మాకు గెలిపించే, ఓడించే శక్తి ఉందని కమ్యూనిస్టులు అంటున్నారు. భాజపా తప్పుడు పద్దతిలో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తుందనీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. భాజపాను ఎదుర్కొనేందుకు ఉభయ కమ్యునిస్టు పార్టీలు కలిసి కట్టిగా పని చేయాలని  నిర్ణయించుకున్నట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు. భాజపా ప్రమాదకర శక్తిగా తయారైందనీ.. భాజపా మళ్ళీ అధికారంలోకి వస్తే దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని తమ్మినేని వీరభద్రం అన్నారు.


కేంద్ర ప్రభుత్వంపై భారాస, కేసీఆర్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావుతో కలిసి సంయుక్తంగా తమ్మినేని వీరభద్రం చెప్పారు. రాహుల్ గాంధీపై తీసుకున్న చర్యలను వెనక్కి తీసుకోవాలని భాజపా ప్రమాదకర శక్తిగా తయారైందనీ.. భాజపా మళ్ళీ అధికారంలోకి వస్తే దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని తమ్మినేని వీరభద్రం అన్నారు. డిమాండ్ చేశారు. ఈడి, సీబీఐతో ప్రతిపక్షాలను కేంద్ర ప్రభుత్వం లొంగ తీసుకుంటుందని.. మోదీ అక్రమాలు, మైనార్టీలపై జరుగుతున్న హత్యాకాండపై షర్మిల స్పందించడం లేదని తమ్మినేని వీరభద్రం అన్నారు.


మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై పల్లెత్తు మాట అనడం లేదనీ.. షర్మిల నాటకాలు మానుకుంటే మంచిదని తమ్మినేని వీరభద్రం హితవు పలికారు. ఏప్రిల్ 9న ఎగ్జిబిషన్ మైదానంలో సీపీఎం, సీపీఐ శ్రేణులతో సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ సమ్మేళనానికి సీపీఎం, సీపీఐకి చెందిన రాష్ట్ర స్థాయి నుంచి మండలి స్థాయి నాయకులు హాజరవుతారనీ తమ్మినేని వీరభద్రం చెప్పారు.


చట్ట సభల్లో అడుగుపెట్టడమే లక్ష్యంగా ఉభయ కమ్యునిస్టు పార్టీలు పని చేస్తున్నాయని.. ప్రధాని విద్యా అర్హతల గురించి అడిగితే..25 వేల జరిమానా విధించడం ఏమిటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు ప్రశ్నించారు. మోడీలను ప్రశ్నిస్తే అనర్హత వేటు ,రెండేళ్ళ జైలు శిక్షా వేస్తున్నారని సాంబశివ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: