డిజిటల్‌ పేమెంట్లు: జనం జేబులకే చిల్లు పెడతారా?

దేశాన్ని డిజిటలైజేషన్ వైపు ప్రధాని నరేంద్ర మోదీ అందరికి అలవాటు చేసేశారు. అయితే ఏప్రిల్ 1, 2023 నుంచి గూగుల్ పే, ఫోన్ పే, లాంటి ఆన్ లైన్ డిజిటల్ యాప్ ల ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేస్తే డబ్బులు కట్ అవుతాయని ప్రచారం సాగుతోంది. కానీ అలాంటిదేమీ లేదు. ఫోన్ పే వ్యాలెట్ లో ఉన్నమనీ ట్రాన్స్ పర్ చేసినపుడు ఆ యాప్ కు, సదరు బ్యాంకుకు ఛార్జీలు వర్తిస్తాయని కేంద్రం చెబుతోంది. వాలెట్ ద్వారా మర్చంట్ కు ట్రాన్స్ క్షన్ చేస్తే నగదు రిసీవ్ చేసుకున్న బ్యాంకు, వాలెట్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ ఛార్జీలు కేటగిరీని బట్టి 0.5నుంచి 1 శాతం వరకు ఉన్నాయి. అంటే బ్యాంకులు చెల్లించాల్సిన సొమ్ములు అని అర్థం.

గతంలో ఇలాంటి చోటనే తేడా కొట్టింది. మనం క్రెడిట్ కార్డులు గనక హస్పిటల్స్ లో, వ్యాపార సంస్థల్లో గానీ వారు తీసుకోమని చెబుతారు. కారణం వారికి 2 శాతం ట్యాక్స్ పడుతుంది. ఆ రెండు శాతం ట్యాక్స్ కూడా క్రెడిట్ కార్డు నుంచి తీసుకోవడానికి ఒప్పుకుంటేనే వారు ఆ క్రెడిట్ కార్డును యాక్సెప్ట్ చేస్తున్నారు. లేకపోతే యాక్సెప్ట్ చేయడం లేదు.

కేంద్రం తెచ్చిన ఈ నూతన సవరణ కూడా రేపటి రోజు ఇలాగే తయారవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ప్రజలకు భారంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటాయనడం లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనం ట్రాన్స్ క్షన్ చేసే డబ్బులకు బ్యాంకులు, పేటీఎం ఎందుకు ట్యాక్స్ చెల్లించాలనే కనీసం అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని వల్ల చివరకు యూసర్ కే ఆ ఛార్జీల మోత మోగుతుంది. ఎలాగో బ్యాంకులు, గూగుల్ ఫే, ఫోన్ ఫే, పేటీఎం లాంటి సంస్థలు భారాన్ని భరించవు. కస్టమర్ల మీదనే ఈ అదనపు భారాన్ని మోపుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: