చంద్రబాబు దొరికినా.. జగన్‌ మిస్‌ చేసుకున్నారా?

ఓటుకు నోటు కేసులో అప్పుడు రూ. 5 కోట్లు అని ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఓటుకు పది కోట్లు అని టాక్ నడుస్తూనే ఉంది. ఈ విషయంలో మాత్రం పత్రికలు, మీడియా ఎవరికి తోచిన విధంగా వాళ్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. పాత్రి కేయ ధర్మం పాటించుకుండా దిగజారిన రాజకీయాలకు వత్తాసు పలుకుతూ వార్తలు రాస్తున్నారు.

టీడీపీ పత్రికలు రాపాక వరప్రసాద్ ను టార్గెట్ చేసి వార్తలు ప్రచురించాయి. టీడీపీ బేరం పెట్టినా నేను అమ్ముడు పోలేదు. నాకు రూ.10 కోట్లు ఇస్తానని అన్నారు. అయినా నేను నిజాయతీగానే ఉన్నానని చెప్పారు. కానీ ఆ రెండు పత్రికలు మాత్రం వైసీపీలో చేరేందుకు, ఎంత తీసుకున్నారు, అమ్ముడుపోయిన వ్యక్తి  అంటూ తీవ్ర విమర్శలు చేస్తూ కథనాలు రాశాయి.  దీనికి స్పందించిన రాపాక నాకు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యం. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి నా అవసరం లేదని భావిస్తాను. కానీ నా నియోజకవర్గం డెవలప్ మెంట్ కావాలంటే మాత్రం నేను అధికార పార్టీలో ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

సాక్షి పత్రిక ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ ఎవరిని కలిసి క్రాస్ ఓటింగ్ కు పాల్పడిందో వివరాలతో చెప్పింది. ఆనం, శ్రీదేవి లు చేసి వ్యాఖ్యలు, వారు క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన విధానాలను హైలైట్ చేసి చూపించింది. ఇలా ఆంధ్రప్రదేశ్ లో మీడియా రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరికి తోచిన విధంగా వారు రాసేస్తున్నారు.

ప్రజలు మాత్రం ఎక్కడ నిజం రాశారో అని వెతికి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. అధికార పక్షాన్నిఎలాగైనా గద్దె దించాలని టీడీపీ, జనసేన దాని అనుకూల మీడియా ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది.  వచ్చే ఎన్నికల నాటికి ఈ వివాదన్నే బ్రహ్మస్త్రంగా రెండు పార్టీలు వాడుకుంటాయా వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: