జగన్ తెగింపు.. వైసీపీకి లాభమా.. నష్టమా?
తాను జైల్లో ఉండి కూడా పార్టీని ఏర్పాటు చేయడం అదొక మొండితనం. ఒకేసారి సచివాలయాలు ఏర్పాటు చేయడం కూడా మొండితనమే. ఒక విధానాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకువచ్చే రైతు భరోసా కేంద్రం, నాడు నేడు ఇలా. ముందు ఒక బిల్డప్ తో తాను అనుకున్నది పదిమందికి చెప్పి వాళ్ళ నిర్ణయం తీసుకోవడం కాకుండా తాను నిర్ణయం తీసుకుని బాధ్యత అంతా నాదే అనుకోవడః జగన్ మోహన్ రెడ్డి పద్ధతి. చంద్రబాబు నాయుడు కి జగన్ కి ఉన్న తేడా ఇక్కడే.
చంద్రబాబు నాయుడు అయితే తాను అనుకున్న విషయాన్ని అందరితో కూర్చుని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ జగన్ అలా చేయకుండా బాధ్యత అంతా తాను ఒక్కడి మీద వేసుకుంటారు. అంతేకాకుండా తన పార్టీలోని ఉన్న వాళ్ళతో నీకు సీటు రాదు, ఇంకొకళ్ళని పెట్టుకోబోతున్నామని ముందుగా చెప్పడం గాని, పబ్లిక్ లో నీకు ఆదరణ తగ్గుతుంది సరిదిద్దుకోమని చెప్పడం గాని టైం ఇవ్వడం గాని ఇవేమీ రాజకీయ నాయకులకు నచ్చవు.
రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత తనకు తిరుగులేదు అనుకుంటాడు. తన నియోజకవర్గంలో చేసేటువంటి సంక్షేమ పథకాలతో తనకు తిరుగులేదు అనుకుంటాడు. అలాంటి సందర్భంలో జగన్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అందుతున్నా కూడా నువ్వు గెలవలేవు ఎందుకంటే వారి దగ్గర నువ్వు పలుచన అయ్యావు అని చెప్తే, ఎవరో మీకు గిట్టని వాళ్ళు చెప్పారు అంటారు కానీ ఒప్పుకోరు. ఇప్పుడు జగన్ తెగింపు తప్పవుతుందా రాబోయే కాలంలో ఎదురు దెబ్బ అవుతుందా అనేది చూడాలి.