కాకపుట్టిస్తున్న నెల్లూరు రాజకీయాలు?

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా సంచలనంగా మారింది. ఇక్కడి ప్రజాప్రతినిధులు సస్పెన్షన్లకు గురయ్యారు. గతంలో మేకపాటి ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సస్పెండ్ చేస్తే ప్రస్తుతం జగన్ సస్పెస్షన్ చేశారు. నెల్లూరులో గతంలో కూడా ఇలాంటి సస్పెన్షన్లు జరిగాయి. 2007 లో శాసనమండలిని పునరుద్ధరించారు. ఇందులో శాసనమండలికి మార్చిలో ఎన్నికలు జరిగాయి. నెల్లూరు జిల్లా శాసన మండలి స్థానిక ఎమ్మెల్సీ కోటాలో సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి, అత్మకూర్ మాజీ ఎమ్మెల్యే సుందరరామిరెడ్డి కొడుకు జడ్పీటీసీ రాఘవేంద్ర పోటీకి దిగారు. టీడీపీ అభ్యర్థిని పోటీ లో పెట్టలేదు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండేది.

మొత్తం 796 ఓట్లు ఉంటే అందులో కాంగ్రెస్ 437, టీడీపీ 227 ఉన్నాయి. మిగతా సీపీఎం, సీపీఐ తదితరులు కలిపి 50 వరకు ఓట్లు ఉండేవి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని  జేసీ దివాకర్ రెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు  అప్పగించారు. కానీ హోరాహోరీ జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర గెలిచారు. అయితే ఈ గెలుపునకు కారణం సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు.

మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారని వైఎస్ జగన్ మేకపాటిని సస్పెండ్ చేశారు. అటు తండ్రి, ఇటు కొడుకు చేతిలో రెండు సార్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు ఓడగొట్టారో.. ఎవరికి అర్థం కాలేదు. నెల్లూరు జిల్లా రాజకీయాలు అతి సంక్లిష్టం. ఎవరూ ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీలో ఉంటారో చెప్పడం కష్టం. నల్లపురెడ్డి, ఆనం, మాగుంట, మేకపాటి కుటుంబాలు, కాంగ్రెస్, వైసీపీ,టీడీపీ పార్టీల్లో పని చేశారు. ఇలా అతి క్లిష్టమైన రాజకీయాలు నెల్లూరు సొంతం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: