వివేకా కేసులో కొత్త సిట్.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?
వివేకాను అవినాష్ రెడ్డి హత్య చేయించడానికి కారణం ఎంపీ టికెట్ కోసమని, జగన్ ఎందుకు సహకరించడంటే తనకు ఎక్కడ వివేకా పోటీ కి వస్తాడేమోనని టీడీపీ, ఎంపీ రఘురామ ఆరోపణలు చేస్తుంటారు. సీబీఐ దర్యాప్తులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అవినాష్ రెడ్డి ని నిందితుడిగా చూపేందుకు విశ్వప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. జగన్ వేరే పార్టీ పెట్టుకుని సొంతంగా కాంగ్రెస్ ను ఎదిరించి ఎంపీగా గెలిచాడు. సొంత పార్టీ పెట్టుకున్న కూడా మొదట వైెఎస్ విజయమ్మకు విశాఖ టికెట్ ఇచ్చాడు. ఆ ఓటమి అనంతరం కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడానికి దూరంగా ఉంటున్నారు. కానీ దీన్ని కూడా వివేకా హత్య కేసులో ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి.
తెలుగుదేశం అధికారంలో ఉండగా ఇలాంటి హత్యకు ప్లాన్ చేస్తాడా అనే చిన్న లాజిక్ ను ఎలా మిస్ అవుతున్నారో తెలియడం లేదు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ కేసులో విచారణ అధికారిని కచ్చితంగా మార్చాలని చెప్పింది. రాంసింగ్ వ్యవహార శైలిని తప్పుపట్టింది. దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆదేశించింది. విచారణ అధికారిని మార్చాలని సీబీఐ కి ఆదేశించింది. సునీత వేసిన కేసు ప్రాతిపదికన మీదనే కేసును కొనసాగిస్తున్నట్లు ఇది సరైనది కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.