నటి సన.. జీవితంలో ఎన్ని కష్టాలో?

సినిమా చూస్తున్న ప్రేక్షకులకు, సినిమాను అభిమానించే అభిమానులకు అందులో నటించే నటీనటులు పెద్దవారైనా, చిన్నవారైనా వాళ్లను ఒక స్టార్లుగా భావించి లేదా వాళ్ళకి జీవితంలో లోటు ఉండదు అనుకుంటూ ఉంటారు. కానీ సినిమా వాళ్ళ జీవితంలో కూడా కష్టాలు ఉంటాయని సన చెప్తుంది. సినిమాలో తల్లి పాత్రలు, అక్క పాత్రలు ఇలాంటి పాత్రల్లో ఎక్కువగా కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సన తన జీవితంలో తన పడిన కష్టాల గురించి తాజాగా బయటకు చెప్పింది.

బేసిక్ గా అందగత్తె అయినా సనాకి కెరీర్ మొదట్లో హీరోయిన్ అవకాశాలు వచ్చి బికినీలు ఇలాంటివి ధరించమని సినిమా యూనిట్ చెప్తే నేను పిల్లల తల్లిని అని చెప్తే, అవతలి వాళ్ళు పిల్లల తల్లివని చెప్పకు, పెళ్లి కాలేదని చెప్పు అని చెప్పి ఇట్లాంటివి చెయ్యమంటే చేయనంది. దాంతో ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే వచ్చాయి ఆమె సినీ జీవితంలో.

కానీ సన ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతోనే చాలామంది ప్రేక్షకుల మనసులను తన నటనతో మెప్పించింది. ఆమె ముస్లింల కుటుంబంలో పుట్టి బురఖా లేకుండా ఎందుకు వెళ్తుంది? ఇట్లాంటివి ఎందుకు చేస్తుంది అని చుట్టుపక్కల వాళ్ళు చెబితే తల్లితండ్రులు తనకు అండగా నిలబడ్డారు. ఇంత చేసి తన కష్టపడి తన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది.

తన కూతురికి దుబాయ్ సంబంధం చూసి పెళ్లి చేస్తే ఆమె సంపాదించి ఇచ్చిన సొమ్మునంతా అల్లుడికి కుటుంబం తినేస్తే చివరికి దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న సనా కూతురు మళ్ళీ ఇంత కష్టపడ్డ తన తల్లికి తన బాధలు చెప్తే ఎలా అని తన కూడా తనలో తాను కష్టపడింది. విషయం అంతా తెలుసుకున్న సనా తన కూతురిని వెంటనే తన ఇంటికి తీసుకువచ్చి ఇవాల్టి రోజున కౌన్సిలింగ్ చేయిస్తూ చక్కగా చూసుకుంటుంది. అంటే సినిమాల్లో కష్టాలు పడడమే కాదు, నిజ జీవితంలో కూడా పడ్డ కష్టానికి సజీవ సాక్ష్యం సనా జీవితం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: