ఆంధ్రా.. అప్పుల ఊబిలో కూరుకుపోతోందా?
లేదంటే ఒకదానికే ఖర్చు పెట్టాలి. మౌలిక వసతులు కోసం 70రూపాయలు ఇచ్చి సంక్షేమానికి 30రూపాయలు ఇస్తే ఒప్పుకుంటారా ఎవరైనా అనేది మెయిన్ పాయింట్. ఇంతకుముందు చంద్రబాబు టైం అప్పుడు 21/2లక్షల కోట్లు దాకా అప్పు ఉంది కదా. ఇప్పుడది 31/2లక్షల కోట్లు, 3లక్షల 70వేల కోట్లు ఇంకా పైన కలిపితే కార్పోరేషన్ ద్వారా ఒక లక్ష 20వేల కోట్లు అందులో రాశారు కూడా.
కార్పొరేషన్ అప్పులనేవి ఈ ఒక్కసారే తీసుకున్నవి కాదు కదా. గతంలో కూడా తీసుకున్నారు కదా. ప్రస్తుత ప్రభుత్వం కూడా తీసుకుంది. ఇది వరకటి రోజుల్లో ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్, లేకపోతే గనుక సివిల్ సప్లై కార్పొరేషన్, ఆర్టీసీ కార్పొరేషన్ మీద కూడా అప్పులు తీసుకున్నారు కదా. ఒకరు కార్పొరేషన్ దగ్గర అప్పు తీసుకుంటే కరెక్టు, ఇంకొకరు తీసుకుంటే తప్పు అనడం మాత్రం సమంజసం కాదు.
అప్పు గురించి ఉన్నదాన్ని 10 లక్షల కోట్ల రూపాయలు 12 లక్షల కోట్ల రూపాయలు అని వక్రీకరించి రాయడం తప్పే. కరోనా లాంటి విపత్కర సమయంలో రాష్ట్రానికి ఆదాయం లేనప్పుడు కేంద్ర ప్రభుత్వమే తిప్పలు పడింది. రెండు సంవత్సరాల పాటు అప్పులు ఎక్కువ అవసరమయ్యాయి ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. నాలుగేళ్లలో రెండేళ్లు ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో అప్పు కచ్చితంగా ఎక్కువే ఉంటుంది. సేమ్ టైం ప్రజలకు సదుపాయం అన్నది సక్రమంగా అందిందా లేదా అన్నది కూడా చూసుకోవాలి.