రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫుల్ ఖుషి గా ఉంది. పాదయాత్ర అప్పుడు కూడా లేనటువంటి స్పందన తో మమతా బెనర్జీ, కేసీఆర్ వీళ్ళందరూ కాంగ్రెస్ వెనకాల నిలబడి కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి సిద్ధపడతారేమో రాహుల్ కి శిక్ష పడిన సందర్భంలో. రాహుల్ కి శిక్ష వేసింది న్యాయస్థానం. ఎలాంటి శిక్ష పడితే ఎలా చేయాలో రాజ్యాంగం చెప్పింది, సుప్రీంకోర్టు కూడా అలా చేయట్లేదు ఎందుకని నిలదీసింది ప్రభుత్వాన్ని గతంలో.

ఆటోమేటిక్ గా వర్తిస్తుందని మళ్లీ సుప్రీం కోర్టే చెప్పింది. అలాగని దానికి అప్పీలు చేసుకోవడానికి ఉంటుందని చెప్పలేదు. ఇప్పుడేమైనా అప్పీల్ చేసుకోవడానికి 30 రోజుల దాకా స్టే ఇచ్చారు కాబట్టి శిక్ష అమలు కావట్లేదు. కాబట్టి పైన అప్పీల్ దాకా ఆగాలి అని గనక సుప్రీంకోర్టు చెబితే అసలు ఈ గొడవే ఉండదు. ఈ ప్రజాప్రతినిధులు, ఎవరైతే సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు చేసేటటువంటి నేరాలను కంట్రోల్ చేయకపోవడం వల్ల రకరకాల ఆప్షన్స్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆ రోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఇప్పుడు ఈ వ్యవహారంలో జరుగుతున్నటువంటి నేపథ్యం వాస్తవంగా అలాంటి ఖూనీకోరు విషయం కాదు రాహుల్ ది అయితే. నోటి మాటకు సంబంధించింది. విమర్శలు చేయవచ్చు కానీ వ్యక్తిగత దూషణలు, వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్ ల గురించి ఇప్పుడు శిక్ష వేసినటువంటి పరిస్థితి ఆయనకు. రాబోయే రోజుల్లో ఒక విధంగా మారాలి.

కింద కోర్ట్లు తీర్పు ఇచ్చినా హైకోర్టో సుప్రీంకోర్టో అప్రూవ్ చేసేదాకా ఆ కేసును కన్ఫర్మ్ చేసేదాకా వాళ్ళు మీదే ఏదైనా చర్యలు తీసుకోవద్దని భవిష్యత్తులో సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు ఇస్తుందేమో చూడాలి. విమర్శించే హక్కు ఉందని దానికి వాక్ స్వాతంత్రం అని పేరు పెట్టి ఎవరి మీద అయినా ఎంత మాటైనా అనొచ్చు అనుకుంటే అన్న వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు అయినా కోర్టులు వెంటయితే తిరగాల్సి వస్తుందని దీన్ని బట్టి అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: