చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

ప్రస్తుతం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే 22 ఓట్లు కావాలి. టీడీపీ మొత్తంగా 23 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. కాబట్టి ప్రస్తుతం 22 స్థానాలు అవసరం రాగా 23 స్థానాల్లో గెలిచినటువంటి టీడీపీకి వాస్తవంగా 19 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారు. నలుగురు వైసీపీ చెంతకు వెళ్లిపోయారు. అయితే ఇక్కడ మరో సమస్య ఏంటంటే వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు.

అయినా సరే.. ఒక ఓటుతో టీడీపీ ఎమ్మెల్సీ స్థానం కోల్పోయే అవకాశం ఉండేది. కానీ నెల్లూరులో అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలు వైసీపీకి ఉండటం చంద్రబాబుకు కలిసొచ్చింది. జగన్ వారిని  బుజ్జగించే ప్రయత్నాలు చేయకపోవడం వల్ల ఆ ఓట్లు టీడీపీకి పడ్డాయి. అంతేకాదు.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో ఎమ్మెల్సీ స్థానం టీడీపీ గెలిచే అవకాశం లభించింది.

సాధారణంగా చంద్రబాబు రాజకీయ పార్టీ పరంగా గతంలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని చాకచక్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలకు సంబంధించి టీడీపీ అధినేత గాలం వేశారు. తద్వారా ఏడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాల్సిన వైసీపీ ఆరింటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఉన్న టీడీపీ సభ్యులు అందరూ ఉంటే కచ్చితంగా ఒక ఎమ్మెల్సీ స్థానంలో సునాయాసంగా గెలిచేది. కానీ టీడీపీ కి నలుగురు సంఖ్య తగ్గడం వైసీపీ నుంచి కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉండడంతో ఇక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఇప్పుడు ఇదే జోష్‌తో మరొకందరిని తమ వైపునకు లాగేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారు. మరి వరుసగా రెండు ఎన్నికల్లో దెబ్బ తిన్న జగన్.. ఇకనైనా జాగ్రత్త పడతారా.. అసలే ఎన్నికల ముందు ఇలాంటి అపజయాలు పార్టీ స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉంది. మరి జగన్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: