పవన్ కల్యాణ్‌.. విడాకులకు రెడీ అయ్యారా?

పవన్ కల్యాణ్‌.. బీజేపీతో విడాకులకు రెడీ అవుతున్నట్టే కనిపిస్తున్నారు. బిజెపి ఇంకా జనసేనలను ఎప్పుడు విడదీయాలని భావించే దాంట్లో తెలుగుదేశం ముందు నుండి ఉంది జనసేనని తెచ్చుకోవడానికి. బిజెపితో పాటు కలిసి వస్తే ఓకే లేదంటే బిజెపిని వదిలేసి జనసేనైనా రావాలని వాళ్ళ అభిప్రాయం. వైసీపీకి కూడా వీళ్లిద్దరు విడిపోవాలి అని అదే ఆలోచన ఉంది.  ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంకా జనసేన కలిస్తే తృతీయ ప్రత్యామ్నాయం అవుతుంది. విడిపోతే అది తెలుగుదేశంలో కలిసిపోతే ఒక కమ్యూనిస్టు ఇంకా బీజేపీ లాగా దెబ్బ తినేస్తుంది జనసేన అన్నటువంటి ఆలోచన ఉంది.

అందు కోసం వీళ్ళు కూడా తపన పడ్డారు. అదే సమయంలో జనసేన లో ఉన్న వాళ్ళలో కూడా తపన ఉంది. ఏంటది అంటే జనసేన తెలుగు దేశంతో కలిసి వెళ్తే కనీసం 25 నుంచి 30 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, అలా మనం సీట్లు సాధించాలి అనుకునేవాళ్లు  బిజెపితో విడిపోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే బిజెపి తెలుగుదేశం పార్టీతో కలవదు కాబట్టి, బిజెపి నుండి విడిపోయి టిడిపితో కలవాలని కోరుకుంటున్నారు మెజారిటీ జనం.

కానీ ఒక వర్గం మాత్రం అలా అనుకోవడం లేదు. మనం ఇండివిడ్యువల్ గా బలపడాలని, బిజెపితో కలిసి బలం పెంచుకొని ఆ తర్వాత మనం ఇండివిడ్యువల్ గా తృతీయ ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్న వాళ్ళు ఇంకొక వర్గం. వాళ్ళ శక్తి తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఫైనల్ గా అయితే వాళ్ల శక్తి పెరిగింది. పవన్ కళ్యాణ్ రేపొద్దున రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది.

మొన్న పవన్ కళ్యాణ్ బిజెపి గురించి బిజెపి జాతీయ నాయకులతో నాకు బానే ఉంది కానీ, రాష్ట్ర నాయకులతోనే సమస్య అని బిజెపిని టార్గెట్ చేశారు. రాష్ట్ర నాయకులు మొన్న నోరు విప్పి అసలు ఏనాడు మాకు సపోర్ట్ చేశారు సక్రమంగా అని అనడంతో ఈ పాయింట్ ని పట్టుకుని వీళ్ళు విడిపోవాలని కోరుకునే వాళ్ళు దీన్ని పతాక స్థాయికి తీసుకెళ్తారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: