జగన్, బాబు, పవన్, కేసీఆర్‌: ఎవరి జాతకం బావుందంటే?

ఉగాదికి సంబంధించి మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకుల జాతకాలను గమనిస్తే మొదటగా జగన్ ది మిధున రాశి : ఆదాయం-2, వ్యయం-11, ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే ఉందని, రాజపూజ్యం-2, అవమానం-4, తెలుగుదేశం అనుకూల మీడియా4, వీళ్ళ అనుకూల మీడియా2 ఉంది కాబట్టి అది కూడా సరిపోయేలా ఉందని చెప్పొచ్చు.

చంద్రబాబుది కర్కాటక రాశి : ఆదాయం-11, వ్యయం-8 కాబట్టి ఆయనకి కొంత డబ్బులు మిగిలే అవకాశం ఉంది. రాజపూజ్యం -5, అవమానం-4 కాబట్టి గౌరవించబడటం ఎక్కువ. ఇక పవన్ కళ్యాణ్ ది మకర రాశి : ఆదాయం-11, వ్యయం-5 కాబట్టి ఈ ఏడాది ఆయనకి బోలెన్ని డబ్బులు మిగిలిపోబోతున్నాయట. రాజపూజ్యం-2, అవమానం-6, మిత్రుడుగా చూపిస్తూనే శత్రుత్వం చూపే వాళ్ళు ఉంటారట.

సోము వీర్రాజు వృషభ రాశి :  ఆదాయం-14, వ్యయం-11 కాబట్టి ఒక రూపాయి మిగులుతుంది. రాజపూజ్యం-6, అవమానం-1, కాబట్టి ఇక్కడ కూడా బెటరే. నారా లోకేష్ మేష రాశి: ఆదాయం-5, వ్యయం-5 కాబట్టి మిగిల్చుకునేది ఏమీ లేదు‌. రాజపూజ్యం-3, అవమానం-1 కాబట్టి గౌరవం పెరుగుతుంది.
ఇక తెలంగాణ నాయకుల జాతకాలు చూస్తే:  కెసిఆర్ ది కర్కాటక రాశి : ఆదాయం-11,వ్యయం-8 కాబట్టి ఆయనకి కూడా డబ్బులు బాగానే మిగులుతాయి. రాజపూజ్యం-5, అవమానం-4 కాబట్టి అవమానం కంటే గౌరవం కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఇక బండి సంజయ్ ది వచ్చి కన్యారాశి : ఆదాయం-2, వ్యయం-11. ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది.  రాజపూజ్యం-4, అవమానం-7 కాబట్టి తిట్టడం, తిట్టించుకోవడం అనేది ఎక్కువ ఉంటుంది. రేవంత్ రెడ్డి ది తులా రాశి : కానీ ఈయన ఆదాయం-14 అని మాత్రమే మనకు దొరుకుతున్న సమాచారం. మరి ఈ ఉగాది రాశి ఫలాలు ఎంత వరకూ నిజం అవుతాయన్నది.. ఈ ఏడాది చివర్లో బేరీజు వేసుకుంటే కానీ తెలియదు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: