జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ టార్గెట్ చంద్రబాబు నాయుడు అయితే, ఇన్ డైరెక్ట్ టార్గెట్ పవన్ కళ్యాణ్ లాగా కనిపిస్తున్నారు. ఇప్పుడు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో పాత్రధారి గురించి జగన్మోహన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో చెప్పి మరి వివరించడం జరిగింది. సీమన్స్ సంస్థ నుంచి 3700 కోట్లు వస్తాయని ప్రజలను నమ్మించి 371 కోట్ల రాష్ట్ర సొమ్మును మాత్రం ఖర్చు పెట్టేశారు.

వాస్తవంగా ఆ డబ్బులు తిరిగి  వివిధ బోగస్ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబుకే వచ్చాయి. చంద్రబాబు స్వయంగా చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేస్తే, చీఫ్ సెక్రటరీ ఆర్థిక శాఖ కార్యదర్శి కి ఫోన్ చేసి చంద్రబాబు చెప్పారు కాబట్టి డబ్బులు ఇవ్వమని చెప్పారని నోట్ ఫైల్ మీద స్వయంగా రాసిన నేపథ్యంలో ఈ కుంభకోణానికి స్వయంగా చంద్రబాబే పాత్రధారి అని 2017-18 లో తెలిసినా నోట్ ఫైల్స్ కూడా మాయం చేసేస్తే, షాడో ఫైల్స్ అనే వాటి ద్వారా ఈ వదంతమంతా బయటపడిందని జగన్మోహన్ రెడ్డి  టీవీ5, ఈనాడు, జ్యోతి వీటన్నిటిని విమర్శించడంతోపాటుగా దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించరని స్వయంగా అసెంబ్లీలో అడిగారు.

ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఈడి విచారణలో నలుగురిని అరెస్టు చేశారు. ఆల్రెడీ ఇందులో సిఐడి ఎంక్వయిరీ ని ఆపించారు. అయినా ఈడి విచారణ చేస్తే పట్టుకున్నారు. ఇప్పుడు కంటిన్యూగా దర్యాప్తు కూడా జరుగుతుంది. ఇంత ఓపెన్ గా 370 కోట్ల రూపాయలు మాయమైపోతే, తినేస్తే ఎందుకు ప్రశ్నించరు అవినీతిని ప్రశ్నిస్తానని మాటలు మాట్లాడే అటువంటి వ్యక్తి ఎందుకు ప్రశ్నించరు అని పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండానే పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీలో ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి.

మరి దీనిపై, మరి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించడమే తమ నైజం అనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదంటే  జగన్ మాటలకు పవన్ కళ్యాణ్ నేనెందుకు స్పందించాలంటారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: