కొత్త ఆయుధాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యా?

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై దాడులను పెంచేశారు. సరికొత్త ఆయుధాలు ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే క్లస్టర్ బాంబులు, ఎఫ్ 37 మిస్సైల్ ల దాడితో ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దాడుల దాడిని తట్టుకోలేక ఉక్రెయిన్ సైనికులు వెళ్లి అడవిలో దాక్కుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అడవిలో దాక్కున్న ఉక్రెయిన్ సైనికులను ప్రత్యేక డ్రోన్లను పెట్టి జల్లెడ పడుతూ  రష్యా సైన్యం వారిని ఎటాక్ చేస్తోంది.

గతంలో లాగా కాకుండా సరికొత్త టెక్నాలజీ ఉపయోగిస్తుంది. టెక్నాలజీ పరంగా రష్యా లో ఉండి ఉక్రెయిన్ లో ఆ దేశ సైనికులు ఎక్కడ గుమిగూడి ఉన్నారు. అనే దాన్ని డ్రోన్ల ద్వారా అంచనా వేస్తూ టార్గెట్ ను చేదిస్తున్నారు. ఒకప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారా టార్గెట్ రీచ్ అయ్యేవారు. గూగుల్ మ్యాప్ చెప్పిన ప్రాంతంపై ఆకాశం నుంచి మిస్సైల్స్ ద్వారా బాంబులు జార విడిచేవారు.

కానీ ఇపుడు ఉన్నచోటి నుంచే ఒక బటన్ నొక్కితే డ్రోన్ల ద్వారా లక్ష్యాన్ని చేదిస్తోంది. సరికొత్త వేపన్స్ బయటకు తీసి ఎటాక్ చేస్తుండడంతో ఉక్రెయిన్ చేతులెత్తేసిన పరిస్థితి. అనుకున్న సమయానికి అమెరికా, యూరప్ దేశాలు ఆయుధాలు ఇవ్వడం లేదు. అమెరికా ఇప్పటికే ఎక్కువగా ఇచ్చామని చెబుతోంది. రష్యా నేమో దాడులను పెంచేస్తోంది. ఉక్రెయిన్ కోసం దాచుకున్న ఆయుధాలు ఇచ్చేస్తే అమెరికా మళ్ళీ తయారు చేసుకోవాలంటే 2 ఏళ్ల వరకు సమయం పడుతుంది.

కాబట్టి అమెరికా అంత సాహసం చేయడం లేదు. రష్యా కొత్త కొత్త ఆయుధాలతో దాడి చేస్తూ దూసుకువస్తోంది. మరియపోల్ లాంటి ప్రాంతాల్లో రష్యా అధ్యక్షుడు పర్యటించడం కొసమెరుపు. ఇన్ని జరుగుతున్న ఇంత మంది చనిపోతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం యుద్ధంలో వెనకడుగు వేయమని చెబుతున్నారు. మరిన్ని నూతన ఆయుధాల తో  రష్యా దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి అలాంటి దాడులను తట్టుకొని ఉక్రెయిన్ నిలబడగలుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: