ఏపీ: పవన్‌ సాధించలేనిది బీజేపీ సాధించిందా?

రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తేనే తమ అస్తిత్వాన్ని కాపాడుకోగలుగుతాయి. పోటీలో కూడా లేకపోతే ఆ పార్టీలను ప్రజలు మరిచిపోతారు. ఎలాగో ఓడిపోతాం కదా.. అని పోటీ చేయకుండా ఉండిపోతే ఎప్పటికీ గెలవలేరు. ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. తక్కువ ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్ల కంటే తక్కువగా వచ్చాయని విమర్శలు వచ్చినప్పటికీ పోటీలో ఒంటరిగా నిలబడి ఆ పార్టీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లను మాత్రం సాధించింది.

కానీ జనసేన మాత్రం పోటీ చేయలేకపోయింది. ఎలాగైనా వైసీపీని ఓడించండి మీరు ఏ పార్టీకి అయినా ఓటు వేయండని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకపోవడం అనేది రాజకీయాల్లో సరికాదన్నది విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. అయితే  ఒంటరిగానే పోటీ చేసినా బీజేపీకి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో 11,270 ఓట్లు మాధవ్ కు వచ్చాయి. తూర్పు రాయలసీమలో బీజేపీ అభ్యర్థి అయిన సన్నారెడ్డి దయాకర్ రెడ్డి 6314 ఓట్లు వచ్చాయి. పశ్చిమ రాయలసీమ స్థానంలో రాఘవేంద్ర అనే అభ్యర్థికి 7494 ఓట్లు వచ్చాయి.

పోటీ చేయాల్సిన కొన్ని పార్టీలు వెనకడుగు వేస్తుంటే ఆంధ్రలో ధైర్యంగా ముందుకు వెళ్లింది బీజేపీ. కార్యకర్తలకు ఢీలా పడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. తెలంగాణలో కూడా 2018 ఎన్నికల్లో బీజేపీ కేవలం 1 అసెంబ్లీ స్థానంలో మాత్రమే గెలిచింది. అయితే అక్కడితో కుంగిపోలేదు. మరింత రెట్టించిన ఉత్సాహంతో ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేసి ఏకంగా నాాలుగు ఎంపీ స్థానాలనే గెలుచుకుని ఆశ్చర్యపరిచింది.

ఒక ఎమ్మెల్యే స్థానం నుంచి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రెండో స్థానంలో పోటీలో ఉంది. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను ఓడించి అధికారాన్ని చేపట్టాలని తహతహలాడుతోంది. ఈ విధమైన ధోరణితోనే ఆంధ్రలో కూడా ముందుకెళ్లి పార్టీని ముందుకు నడిపించాలని కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: