షాకింగ్‌ రిపోర్ట్‌: మోదీకి చైనాలోనూ ఫ్యాన్స్?

అమెరికా, యూరప్ దేశాలలో మోడీ కి మంచి పేరు రావడం ఒక ఎత్తు అయితే, చైనా లాంటి దేశంలో కూడా మోడీని అద్భుతంగా ప్రశంసించడం అనేది తాజాగా వెలుగులోకి వచ్చిన గొప్ప విషయం. భారత్ చైనా సరిహద్దుల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న కూడా, విచిత్రంగా, వీటితో సంబంధం లేకుండా, అంటే భారత్ చైనా శత్రుత్వంతో సంబంధం లేకుండా అక్కడ ఉన్న చైనా ప్రజలకు మోడీ విపరీతంగా నచ్చేసినట్లుగా తెలుస్తుంది.

అంతేకాదు వాళ్లు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏకంగా  "మోడీ లావోజియా* అని ముద్దు పేరు కూడా పెట్టి, అలానే పిలుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంతకీ ఇక్కడ మోడీ లావోజియా అంటే చైనీస్ భాషలో అర్థం ఏమిటంటే మన తెలుగులోకి చెప్పాలనుకుంటే, మోడీ చిరంజీవి శాశ్వత కీర్తి కలిగిన వ్యక్తి అని, వాళ్లు అలా మోడీని ముద్దు పేరు పెట్టి పిలుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది అక్కడ చాలా గొప్ప విషయం. ఇదే విషయాన్ని అక్కడ జర్నలిస్టు ఒకరు చెప్పడం కీలకమైన అంశం.

అమెరికాకు చెందిన మ్యాగజైన్ "ద డిప్లమేట్" లో చైనాలో భారత్ ను ఎలా చూస్తున్నారు అనే శీర్షికన చైనా జర్నలిస్టు మూచుంగ్ షా ఒక వ్యాసం లో వివరించారు. ఈయన చైనీస్ సోషల్ మీడియాని విశ్లేషిస్తూ ఉంటారు. ముఖ్యంగా "సినామిటో"ను విశ్లేషిస్తుంటారు. ఈ యాప్ కి ఏకంగా 58 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

ప్రపంచంలోని పెద్ద దేశాలు అన్నిటితో మోడీ చాలా చక్కగా వ్యవహరిస్తున్నారని చైనా ప్రజలు చెప్తున్నారని చుంగ్ షా చెప్తున్నారు. తాను 20 ఏళ్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు రాస్తున్నానని ఒక విదేశీ నేతకు చైనీయులు ముద్దు పేరు పెట్టడం కూడా చాలా అరుదని చెప్పారు. తమ దేశం పాకిస్తాన్ తో భారత్ ను నిలువరించాలని చూడటం కూడా తప్పని చెప్పినట్లు, అది సరికాదన్నట్లుగా అక్కడ ఉన్న ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: