అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

చంద్రబాబు, జగన్ ల పాదయాత్రతో పోల్చితే లోకేశ్ పాదయాత్రకు జనాలు అంతగా రావడం లేదు. పాపులారిటీ కూడా తక్కువగానే వస్తోంది. కానీ ప్రస్తుతం జోష్ పెరిగినట్లు కనిపిస్తోంది. లోకేశ్ పాదయాత్రతో పోల్చుకుంటే జనసేన ఆవిర్భావకు వచ్చిన జనం మాత్రం ఆశేషం. కానీ పవన్ దాన్ని వినియోగించుకోలేక పోతున్నారు.

ఎన్నికల్లో గెలిచిన గెలవకున్నా ప్రతి ఎన్నికల్లో పోటీ చేయడం అనేది నేర్చుకోవాలి. జనసేనలో ఇది కొరవడింది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో నిలబడలేదు. కనీసం ఏ పార్టీకి కూడా మద్దతు ప్రకటించలేదు. కానీ జనసేన తరఫున మాత్రం వైసీపీకి ఓటు వేయొద్దని చెప్పారు. మేం ఓటు వేయొద్దని చెప్పాము. కాబట్టి ప్రజలు మా మాట విని వైసీపీని ఓడించారు అంటే దాన్ని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు.

రాజకీయాల్లో పార్టీలు పెట్టిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలంటే ఎన్నికలకు సిద్ధం కావాలి. ఆ ఎన్నికలు ఫేస్ చేయాలి. గెలుపు ఓటములు తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయం. కానీ మేము చెప్పిన వారికి ఓటేయండి అంటే అదెలా సాధ్యమవుతుందో పవన్ కు తెలియాలి. ఇప్పటికైనా పవన్ మారాలి. జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలంటే ముందుకు సాగి పోవాలి. కార్యకర్తలు, అభిమానులను జనసేన పార్టీ కార్యక్రమాలు వివరించే విధంగా తీర్చిదిద్దాలి.

లేకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా జనసేనకు పరాభవం తప్పదు. జనసేనకు విపరీతమైన కార్యకర్తల బలం ఉంది. స్వచ్ఛందంగా పవన్ సభలకు వచ్చే జనాలు ఉన్నారు. ఎందుకో మరి పవన్ దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడంలో విఫలం అవుతున్నారు. టీడీపీకి మద్దతు ఇస్తాం. వైసీపీని ఎలాగైనా ఓడిస్తాం అంటున్నారు తప్ప జనసేనను అధికారంలోకి తీసుకొస్తాం. సీఎంగా నేను రాష్ట్రంలో అధికారంలోకి వస్తాను అని అనడం లేదు. ముందు జనసేనలో పోటీ చేయాలనే తత్వం పెరగాలి. క్షేత్రస్థాయి పరిస్థితులను అవగాహన చేసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో ఏమైనా ఎమ్మెల్యే స్థానాలు గెలవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: