అమెరికా ఆయుధాలతో పాక్‌ను వణికిస్తున్న తాలిబన్లు?

పాకిస్తాన్ దగ్గర నైట్ విజన్ కి సంబంధించిన ఆయుధాలు లేవు అయితే దానిపైన తిరుగుబాటు చేసే తెహరీన్ కి తాలిబన్ ఈ పాకిస్తాన్ వద్ద మాత్రం ఇలాంటి ఆయుధాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇదివరకు మన పరిస్థితి కూడా అలానే ఉండేది. అప్పుడు పాకిస్తాన్ దగ్గర స్టెన్ గన్లు, మిషన్ గన్లు, ఇంకా స్నైపర్లు ఇలాంటివి ఉంటే, మన దగ్గర మాత్రం పాత గన్స్ మాత్రమే ఉండేవి. అలాంటి పొజిషన్ నుండి ఇప్పుడు భారత్ అప్డేట్ అవుతూ వచ్చింది.

ఇప్పుడు మన సైన్యం అల్ట్రా మోడ్రన్ అవుతూ వచ్చింది. ఇంకా అప్డేట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే అవతల వాళ్ళు అడ్వాన్స్డ్ గా ఉన్నప్పుడు మనం కూడా దాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇప్పుడు పాకిస్తాన్ అప్గ్రేడ్ అయ్యే పొజిషన్లో లేకపోయినా, టిటిపి దగ్గర మాత్రం ఇలా అప్గ్రేడ్ ఆయుధాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది. ఇక దీనిపై వాళ్లు వీడియో కూడా చేసి రిలీజ్ చేశారు.

2021లో ఇలాంటి వీడియోనే మనం ఒకటి చూసాం. అమెరికా సైన్యం  విమానాలు ఎక్కి పారిపోతుంటే అక్కడ బాంబులతో విధ్వంసం సృష్టించి, వాళ్ళ ఆయుధాలను అక్కడే వదిలేసి పారిపోయేలా చేసి తాలిబన్ వాళ్లు ఆ ఆయుధాల్ని చేజెక్కించుకున్న సీన్ అది. ఐదు బిలియన్ డాలర్లకు సంబంధించిన ఆయుధాలు అంటే చాపర్లు, జామర్లు, ఆయుధాలు ఇలాంటివన్నీ వాళ్ల చేతికి చిక్కాయి.

ఆ తర్వాత ఇలాంటి ఆయుధాలన్నింటినీ అక్కడ రోడ్డు పక్కన పెట్టి కూరగాయలు అమ్మినట్టు అమ్మారు. ఎం24 స్నైపర్సు, ఎం4 కార్బన్స్, ఎం16 ఏ ఫోర్ రైఫిల్స్, థర్మల్ వెపన్స్ ఇలాంటి ఆయుధాలు అన్ని తాలిబన్స్ ఎవరికి కావలసినవి వాళ్ళు పట్టుకుపోయి వాళ్ళ ఫ్రెండ్స్ కు సంబంధించిన షాపుల్లో అమ్మించారు. కొన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ కి సంబంధించిన టిటిపి వాళ్ళు. ఫ్రీగా వచ్చినాయి కాబట్టి, చీఫ్ అండ్ బెస్ట్ గా వాళ్ళు కొని వాటితో ఇప్పుడు పాకిస్తాన్ తాటతీస్తున్నారు అనే విషయం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: