ఉక్రెయిన్‌.. అమెరికా మాటలు విని నాశనం?

ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకండి అని ఉక్రెయిన్ కు అమెరికా స్పీకర్ చెబుతున్నారు. చావో రేవో తేల్చుకుందాం అని జెలెన్ స్కీకి సలహా ఇస్తున్నారు. అమెరికాలో మొన్నటి వరకు బైడెన్ వర్గం చెప్పినట్లు వినేవారు. కానీ ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ లో ట్రంప్ వర్గం ఆధిపత్యం మళ్లీ మొదలైంది. ట్రంపు వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ గా ఎన్నికయ్యారు. దీంతో అమెరికా కాంగ్రెస్ లో బైడెన్ పార్టీకి ప్రశ్నల వర్షం కురుస్తుంది.

ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఆయుధాలను ఇచ్చారు. ఎక్కడెక్కడ యుద్ధంలో పాల్గొన్నారు. ఎన్ని ఆయుధాలు ధ్వంసం అయ్యాయి. ఎంత ఖర్చు చేశారు. ఎన్ని చోట్ల ఇంకా ఆయుధాలను వాడుతున్నారు. ఇంకెంత ఇవ్వాల్సిన అవసరముందనే ప్రశ్నలతో అమెరికా అధ్యక్షుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. రష్యా ఇంకా రెండేళ్ల పాటు యుద్ధం చేసేంత ఆయుధ సామగ్రిని సిద్ధం చేసుకుందని తెలియడంతో అమెరికా కాస్త ఆందోళనకు గురయినట్లుగానే కనిపిస్తోంది.

ఎందుకంటే ఈ యుద్ధం కోసం అమెరికా ఇప్పటి వరకు వేల కోట్ల రూపాయల ఆయుధాలను ఖర్చు పెడుతూనే ఉంది. దీంతో ఆర్థికంగా ఎక్కువగా నష్టపోతున్న విషయాన్ని ట్రంపు వర్గం బయట  పెట్టింది. మరో వైపు బైడెన్ వర్గీయులు మాత్రం ఉక్రెయిన్ కు అండగా నిలిచి పోరాటంలో ముందుండాలని నిర్ణయించుకుంది.

కానీ ఎంత ఖర్చు అయింది. వీటిన్నింటి లెక్క చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు అడగటంలో బైడెన్ నీళ్లు మింగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జెలెన్ స్కీ పిలిచిన ఓ టీవీ ఇంటర్వ్యూకు అమెరికా స్పీకర్ వెళ్లలేదు. కానీ మీరు పోరాటం కొనసాగించండి మీకు తోడుంటాం అని మద్దతు ప్రకటించాడు. అయితే ఒక వైపు మద్దతిస్తూనే మరో వైపు ఆయుధాలకు డబ్బులు ఎక్కువ ఖర్చవుతున్నాయని వాదిస్తోంది. ఉక్రెయిన్ కు  అమెరికా మరిన్ని రోజులు సాయం చేస్తుందా చేతులెత్తుస్తుందా  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: