మరోసారి ఇండియాపై అమెరికా కపట ప్రేమ?

భారత్ పై అమెరికాకు ఎప్పుడు సవితి ప్రేమ నటిస్తూనే ఉంటుంది. తాజాగా భారత్ లో తన వ్యుహాత్మక భాగస్వామిని రెండెళ్లుగా నియమించలేదు. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్ కు  అంబాసిడర్ గా ఎరిక్ గార్జయిన్ ను నియమిస్తుంది. ఎరిక్ ను భారత్ లో దౌత్య వేత్తగా అమెరికా నియమించాలని నిర్ణయించింది. ఎరిక్ పై మహిళలను వేధించిన కేసు ఉంది. లాస్ ఎంజిల్స్ కు సంబంధించిన మాజీ మేయర్ ఈయన. భారత్ తో గతంలో గొడవలు పడిన వ్యక్తి . గతంలో మేయర్ కాకముందు ఆయన జైలుకు వెళ్లి వచ్చిన సందర్భం ఉంది.

డిప్యూటీ మేయర్ గా ఉన్న కాలంలో ఈయన లంచం తీసుకున్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే చీప్ ఆప్ స్టాప్ ఈయన వేధింపులు తట్టుకోలేక లాంగ్ లీవ్ లో వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. 1990 లో క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్ లో అమెరికా రాయబారి 16 నెలలు లేడు. ప్రస్తుతం భారత్ లో 20 నెలలుగా అమెరికా దౌత్య అధికారి లేడంటే అతిశయోక్తి కాదు. ఒక పక్క భారత్ అంటే ఎక్కడ లేని అభిమానం ఉందని చెప్పే అగ్రరాజ్యం కనీసం 20 నెలలుగా దౌత్యవేత్తను నియమించ లేదంటే కారణం మాత్రం చెప్పడం లేదు.

బ్రస్సెల్స్, జింబాబ్వే, అజార్ బైజాన్, కంబోడియా, నైజీరియా, ఉగాండా దేశాలకు రాయబారులను అమెరికా  నియమించలేదు. ఇలాంటి దేశాల సరసన భారత ను అమెరికా నిలిపింది. మళ్లీ బ్రిటన్ తో భారత్ సమానమంటూ సవితి ప్రేమ కురిపిస్తుంటుంది. ఇది కచ్చితంగా లోపల ఒక రకమైన కోపాన్ని పెట్టుకుని పైకి ప్రేమగా నటిస్తుందని చెప్పుకోవచ్చు.  మొత్తం మీద అమెరికా నియమించిన అధికారి ఎరిక్ గతంలో నే భారత్ పై విషం చిమ్మాడు. ఇలాంటి సమయంలో ఆయన నియామకం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: