ఉక్రెయిన్: యుద్ధ సమయంలోనూ ఇంత కక్కుర్తా?
ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఉక్రెయిన్ రక్షణ మంత్రి తీసేశారు. ఉక్రెయిన్ రష్యాపై పోరాటం కొనసాగిస్తుంది. కానీ సొంత మనుషులే అవినీతి చేయడం వల్ల దాన్ని సక్రమంగా చేయలేకపోతున్నారు. దీంతో సైన్యంలో పనిచేస్తున్న వ్యక్తిని రక్షణ మంత్రిగా మళ్లీ నియమించారు. దాదాపు 122 మందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. డిప్యూటీ ప్రాసిక్యూటర్ జనరల్, డిప్యూటీ జనరల్, డిప్యూటీ చీప్ ఆప్ స్టాప్, డిప్యూటీ ఇన్ ప్రాస్ట్రక్చర్ ను తొలగించారు.
అభివృద్ధికి సంబంధించి డెవలప్ మెంట్ డిప్యూటీ మినిస్టర్ ను తొలగించారు. రీజనల్ మేనేజర్లను తీసేశారు. సోషల్ పాలసీ డిప్యూటీ మినిస్టర్ ను పక్కన పెట్టారు. మొత్తంగా 29.3 మిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా అందిస్తోంది. అయితే అమెరికా చేస్తున్న సాయం నుంచి ఉక్రెయిన్ లో జెలెన్ స్కీ మంత్రి వర్గంలో ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు 4 లక్షల డాలర్ల నుంచి 12 లక్షల డాలర్ల వరకు మింగేశారని అమెరికా బయట పెట్టింది.
ఇందులో అత్యధికంగా అవినీతికి పాల్పడింది మాత్రం ఉక్రెయిన్ డిపెన్స్ మినిస్టరేనని తేల్చి చెప్పింది. ఎలాంటి అవినీతి చేశారంటే మిలిటరీ కావాల్సిన ఆహారం, సరకులు, దుస్తులు కూడాా ఇవ్వకుండా అమ్మేసుకున్నారు. దీంతో అమెరికా దిద్దుబాటు చర్చలు చేపట్టింది. మిలిటరీలో ప్రక్షాళన చేస్తే కానీ అవినీతి అధికారులను ముందుగా తొలగిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని బావించింది తదనుగుణంగా ఎవరైతే అవినీతి చేశారో వారి వివరాలను మొత్తం సేకరించింది. రష్యా పై యుద్ధంలో గెలవాలని భావించి సాయం చేస్తుంటే సొంత దేశంలోని అధికారులు అవినీతి చేయడం అమెరికాకు మింగుడు పడని విషయం.