జగన్‌కు డేంజర్ బెల్స్: పక్కా ప్లాన్‌తో చంద్రబాబు?
అవసరమైతే టీడీపీ అధికారంలోకి వస్తే యనమల మండలి, లేదా రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది. ఒక్కొక్క నియోజకవర్గాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తెచ్చుకోవాలని బాబు చూస్తున్నారు. ప్రస్తుతానికి జనసేనతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నా ఆ నియోజకవర్గాల్ని వదిలేసి మిగతా వాటిలో చంద్రబాబు ఎన్నికలకు ముందే అన్ని సెట్ చేసేస్తున్నారు. ఇదంతా ఒక వైపు లోకేష్ యువగళం పాదయాత్ర జరుగుతుండగానే మరో పక్క చంద్రబాబు ఆయా నియోజకవర్గాల్లో గెలుపు బాట పట్టేదెవరూ.. గెలిచే వారెవరూ.. అర్హతలేమిటి, గెలవాలంటే ఏం చేయాలి. తదితర వివరాలతో ముందుగా సన్నద్ధం అవుతున్నారు.
2019 ఎన్నికలు, తర్వాత జరిగిన మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రోజుల తరబడి ఆయా నాయకులను బుజ్జగించేందుకు అధినాయకత్వం కష్టపడాల్సి వచ్చేంది. వైసీపీలో కాస్త గందరగోళం నెలకొంది. కొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారనే నేపథ్యంలో బాబు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎలా గెలుపొందాలనే ఆశయంతో చంద్రబాబు ఇప్పటినుంచే పక్కా ప్రణాళిక అమలు చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఓటమిని మరిచిపోయి.. అప్పుడు జరిగిన పొరపాట్లు మరోసారి జరగకుండా ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్నారు.
దీనికోసం ఇప్పుడు యువగళం కూడా సాయపడుతుండని అనుకుంటున్నారు. లోకేష్, చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్, కలిసి అధికారాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాయి. ప్రజల మనసు దోచేలా ఏం చేస్తే గెలుస్తారో వీరికి అల్రడీ తెలుసు. దాన్ని ఆచరణలోకి తీసుకు రావడమే అసలైన విషయం. కాబట్టి ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉండబోతోందో తెలియదు.