జగన్.. పేదలకు వరం.. ఉద్యోగులకు శాపం?
అలాంటి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేయలేదని విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమకు ఇంకా ప్రయోజనాలు ఉంటాయనే దృష్టితో జగన్ ప్రభుత్వానికి అప్పుడు ఎంతో ఆశతో వాళ్ళందరూ ఓటేశారు. కానీ జగన్ పరిపాలన దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో ఏమాత్రం లోటు చేయకపోయినా కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో ఆలస్యం చేస్తూ వాళ్లని నిరుత్సాహపరుస్తున్నారనేది వాస్తవం.
ప్రత్యేకించి పోలీసు శాఖకు సంబంధించి ప్రతి ఏటా వాళ్లకి అందాల్సిన సరెండర్ ను సరైన సమయంలో జగన్ వాళ్లకు అందకుండా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అసలు ఏ ప్రభుత్వమైనా పరిపాలన విధానంతో పాటు ప్రజా సంక్షేమం అనే విషయంలో కూడా సమ న్యాయం చేసేటట్టు ఉండాలి. అన్ని రంగాల వారిని సంతృప్తి పరిచే పరిపాలన దక్షత ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు అటు చంద్రబాబు నాయుడు పరిపాలనలో గాని.. ఇప్పుడు జగన్ పరిపాలనలో గాని అది కనిపించడం లేదన్నది చేదు వాస్తవం. జగన్ సర్కారు దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వానికైనా తమ ప్రాధాన్యతలు తమకు ఉండటం సహజమే కానీ.. అది మరీ పరిమితులు దాటేలా ఉండటం శ్రేయస్కరం కాదన్నది గుర్తించాలి.