బాబోయ్..ఏపీలో ఒక్కో రైతుపై ఇంత అప్పు ఉందా?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రైతు కుటుంబంపై 2 లక్షల 45 వేల అప్పుల భారం ఉందట. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చెబుతున్నారు. రాజ్యసభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆప్‌ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ అడిగిన ప్రశ్నకు తోమర్‌ ఇలా సమాధానం ఇచ్చారు. జాతీయ స్థాయిలో ప్రతి రైతు కుటుంబం మీద 74వేల 121 కోట్ల రుణం మాత్రమే ఉందట. కానీ ఏపీ రైతులపై అంతకు మూడు రెట్ల భారముందని ఆయన చెప్పిన లెక్కల్లో తెలుస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానంలో కేరళ, పంజాబ్‌ నిలిచాయట. రైతు కుటుంబం తలసరి అప్పు 2లక్షలు దాటిన రాష్ట్రాలు మాత్రం మొత్తం దేశంలో ఈ  మూడే ఉన్నాయట. పక్కనే ఉన్న తెలంగాణలో ప్రతి రైతు కుటుంబంపై లక్షా 52వేల 113 మేర రుణభారముందట. రైతులపై అత్యధిక అప్పున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని ఈ లెక్కలు చెబుతున్నాయి.  దేశవ్యాప్తంగా రైతు కుటుంబాల సగటు ఆదాయం 10,218 రూపాయలతో పోలిస్తే ఏపీ రైతు కుటుంబాల ఆదాయం 10,480గా ఉందట.  అంటే 2.56 శాతం ఎక్కువ ఆదాయం ఉన్నా కూడా అప్పు మాత్రం దాదాపు మూడు రెట్లు అధికంగా ఉందన్నమాట.

ఇక తెలంగాణ రైతుల విషయానికి వస్తే.. అక్కడ కూడా జాతీయ సగటుకంటే రెండు రెట్ల అప్పు ఎక్కువగా ఉంది. అయితే  తెలంగాణఅక్కడి రైతుల నెలవారీ ఆదాయం 9,403 రూపాయలు మాత్రమే ఉందన్నమాట. ఇది జాతీయ సగటు ఆదాయం కంటే 7.9శాతం తక్కువగా గమనించవచ్చు. ఇక్కడ మరో విషయం గమనించాలి.. రైతు కుటుంబాల ఆదాయమంటే ఒక్క పంట దిగుబడుల ద్వారా వచ్చింది మాత్రమే కాదు.

ఇతరంగా వేతనాలు, భూముల లీజు, పశుపోషణ, ఇతరత్రా వ్యవసాయేతర కార్యకలాపాల ద్వారా వచ్చింది కూడానని కేంద్రమంత్రి వివరించారు. 2008-09లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రుణ మాఫీ, రుణ ఉపశమన పథకం అమలు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ రుణమాఫీ అమలు చేయలేదు.  ఒక్కో రైతు కుటుంబంపై సగటున లక్షకు పైగా రుణభారం ఉన్న రాష్ట్రాలు దేశంలో 8 ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: