ఒక్క మాటతో.. బాబును భయపెడుతున్న పవన్?
ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఆ వచ్చేది ఏ ప్రభుత్వం అన్నదానిపై మాత్రం పవన్ క్లారిటీ ఇవ్వడం లేదు. కొన్నిసభల్లో రాబోయేది జనసేన ప్రభుత్వమే అంటున్నారు. మరోవైపు.. వైసీపీ వ్యతిరేక శక్తులను కలిపి ఉంచుతానంటున్నారు.. ఇలా పొంతన లేని మాటలు పవన్ నోట వస్తున్నాయి. అయితే.. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందువల్ల పొత్తులపై అప్పుడే స్పష్టత రాకపోయినా... టీడీపీతో పొత్తు కోసం పవన్ కల్యాణ్ ఈసారి గట్టి పంతమే పట్టేలా ఉన్నారు.
వచ్చే ఎన్నికల తర్వాత తాను సీఎం అవుతానా కానా అన్న విషయం ప్రజలు తేలుస్తారని పవన్ కల్యాణ్ అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రాదని పక్కాగా చెబుతున్న పవన్ కల్యాణ్.. వైసిపి అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యతన తనదే అని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. తనను తాను కోరుకుంటే సీఎం కాలేనని.. జనం కోరుకుంటే సీఎం అవుతానని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబులో కలకలం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల తర్వాత తాను మళ్లీ సీఎం అవుతానన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఆయన ఇప్పుడు కాకపోతే.. వయోభారం వల్ల మళ్లీ ఎప్పటికీ సీఎం కాలేరు. కానీ.. ఇప్పుడు పవన్ కల్యాణ్ అంటున్న మాటలు చూస్తే.. మళ్లీ తాను సీఎం కాలేనేమోనన్న ఆందోళన చంద్రబాబులో కనిపించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల తర్వాత ఎవరు సీఎం అవుతారు.. చంద్రబాబా.. పవనా.. లేకుంటే మళ్లే జగనేనా..?