జగన్‌, చంద్రబాబు.. ఇద్దరూ మోసం చేశారా?

తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అసలు అమలవుతుందా అనే ప్రశ్న మళ్లీ ఎదురైంది. లోక్ సభలో కేంద్ర గ్రామీణ శాఖ ఇచ్చిన జవాబు విని ప్రజలు షాకయ్యారు. పేదల ఇళ్ల విషయంలో తప్పు జరుగుతోందన్న చాలామంది అంచనాలు నిజమయ్యాయి. మొత్తం 20 లక్షల ఇళ్లు కట్టించామని తెలుగుదేశం పార్టీ అప్పట్లో ప్రగల్బాలు పలికింది. అందులో కొన్నింటిని జగన్ ఆపారని గగ్గోలు పెట్టింది కూడా.


ఇటు చూస్తే.. జగన్ 30 లక్షల ఇళ్లు ఇస్తామన్నారు. ఇప్పటికే 15 లక్షల పట్టాలు ఇచ్చామని.. అసెంబ్లీలో చెప్పారు. కానీ కేంద్రం నివేదిక ఏం చెప్పింది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద మూడేళ్లలో కేవలం 5 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తైనట్లు గ్రామీణాభివృద్ధి శాఖ లోక్ సభకు తెలిపింది. 2019 నుంచి 2022 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా... 97,67,825 ఇళ్ల నిర్మాణం జరిగాయి. అత్యల్పంగా ఏపీలోనే 5 ఇళ్ల నిర్మాణం జరిగింది.


2016 నుంచి 2022 డిసెంబర్ 9వ వరకు 1,82,632 ఇళ్లు ఆంధ్రప్రదేశ్ కు మంజూరు కాగా... అందులో 25 శాతం వరకు మాత్రమే పూర్తయ్యాయని లిఖిత పూర్వక సమాధానమిచ్చింది గ్రామీణాభివృద్ధి శాఖ. అంటే కేవలం 46, 726 ఇళ్లు పూర్తయ్యాయి. ఈ లెక్కన చంద్రబాబు 20 లక్షల ఇళ్లు కట్టించాడని.. వాటిలో కొన్ని జగన్ ఆపాడన్న వార్త అవాస్తవంగా తేలింది. సిటీలో 7 లక్షలు, పల్లెల్లో 5 లక్షలు అవుతోంది. అదే ఆవాస్ యోజన కింది వచ్చే 2.8 లక్షలు చేతికి ఇస్తే.. ఎవర ఇళ్లు వాళ్లే నిర్మించుకుంటారు కదా అని కొందరు అంటున్నారు. ప్రజలు మాత్రం ఇళ్లు ఇస్తే జగన్ కు ఓటేద్దాం.. లేకపోతే ఆల్టర్నేట్ గా చంద్ర బాబు, పవన్ కల్యాణ్ ఉన్నారుగా అని జనం చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: