రాష్ట్ర విభజనతో ఏపీకి ఎంత నష్టమో తెలుసా?

1956 నుంచి ఐక్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమం కారణంగా రెండు ముక్కలైంది. 2014 జూన్ 2 నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్ కాస్తా ఏపీ, తెలంగాణగా విడిపోయింది. అయితే.. ఈ విభజన వల్ల ఏపీ బాగా నష్టపోయిందనే వాదన ఉంది. అయితే.. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన ఎంత మేరకు ఆర్థిక నష్టం జరిగిందనే అంచనాలకు మాత్రం సరైన లెక్కలు లేవు.. దీనికి సంబంధించి కేంద్రం వద్ద కూడా ఎలాంటి అంచనాలు, రికార్డులు లేవట. ఈ విషయాన్ని కేంద్రం పార్లమెంటులో తెలిపింది.


రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన ఎంత మేరకు ఆర్థిక నష్టం జరిగిందనే రికార్డులు తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేనట్లేనని మరోసారి పరోక్షంగా కేంద్రం మరోసారి తేల్చి చెప్పేసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. 14, 15 ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు.


ప్రత్యేక హోదా అంశంపై... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలతో సమావేశాలు నిర్వహించారా అని కేశినేని నాని కేంద్రాన్ని ప్రశ్నించగా... ప్రత్యేక హోదా కోసం  పలు రాష్ట్రాలతో పాటు... ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ వివరణ ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం జనరల్ కేటగిరీ రాష్ర్టాలు, ప్రత్యేక హోదా రాష్ర్టాల మధ్య పన్నుల పంపిణీకి ఎలాంటి వ్యత్యాసం చూపలేదని కేంద్రం చెప్పుకొచ్చింది.


15వ ఆర్థిక సంఘం కూడ ఈ విషయంలో ఎలాంటి ప్రత్యేక ప్రస్తావన చేయలేదని కేంద్రం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుతో కేంద్ర పనుల్లో 41 శాతం వాటా రాష్ట్రాలకు ఇస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: