ఏపీ హైకోర్టులో చరిత్రలో ఎప్పుడూ చూడని సీన్‌?

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ గురించి రచ్చ రచ్చ జరుగుతోంది. ఇలా ఇంతగా రచ్చ జరగడం ఇదే మొదటి సారి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే  హైకోర్టులో ఇలా జరగడం మొదటిసారి. జస్టిస్ రమేష్, జస్టిస్ బట్టు దేవానంద్ బదిలీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమం చివరకు.. హైకోర్టు బెంచ్ ముందు వాదోపవాదాలు ప్రారంభించి.. అకస్మా త్తుగా నేను ఇందులో వాదన వినిపించను అంటూ న్యాయవాదులు తప్పుకోవడం కూడా ఇదే మొదటిసారి.

కీలకమైన వ్యాజ్యాల సందర్భంలో కూడా మేం తప్పు కుంటున్నాం.. మేము వాదించం అని లాయర్లు చెప్పడం విశేషం. చివరకు ఈ విచారణలో కొంతమంది న్యాయమూర్తులు బెంచ్ దిగి పోయారు. బస్ట్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మాత్రం  ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరూ వాదించు కోవడానికి అనుమతించబోమన్నారు. ఇట్లా కోర్ట్ లో చేసే దాన్ని తీవ్రంగా పరిగణిస్తామని.. చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అట్లాగే ఆ వ్యవహారం మీద జస్టిస్ ఆర్ రఘునందన్‌రావు బెంచ్‌ ముందు కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి వాదోపవాదాల పరిస్థితి ఇంతవరకు ఎక్కడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరిగినట్లు లేదు. చివరకు ఆంధ్ర, తెలంగాణ ఉద్యమాల సందర్భంలో కూడా ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ గురించి ఇంతగా వివాదం రావడం అన్నది లేదు.

సుప్రీం కొలీజియం చేసినటువంటి బదిలీలని ఆపిస్తామని లాయర్లు చెప్పడం విశేషం. చివరకు చీఫ్ జస్టిస్ ను కూడా కలుస్తామని లాయర్లు అంటున్నారు. ఈ బదిలీల వెనుక జగన్ సర్కారు ఉందని కొందరు లాయర్లు వాదిస్తున్నారు. మొత్తానికి చివరకు రాష్ట్రపతినైనా కలుస్తాం.. ఈ బదిలీలను ఆపిస్తామని లాయర్లు శపథాలు చేస్తున్నారు. అయితే.. ఇవి సిఫారసులు మాత్రమేనని బదిలీలు ఇంకా జరగలేదు కాబట్టి ఆపవచ్చని కొందరు లాయర్లు అంటున్నారు. చూడాలి మరి ఈ బదిలీలు ఆగుతాయో.. లేదో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: