చంద్రబాబు తీసుకొచ్చాడా? జగన్ నిలిపేశాడా?

కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పర్యటనలో సీఎం జగన్ పై అనేక విమర్శలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో 5 ఏళ్లలో రాష్ట్రం లో 16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. అవి కొనసాగి ఉంటే 30 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. అప్పటికే 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఈ రోజు మనం ఉద్యోగాల కోసం హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సి వస్తుందని ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎయిర్‌ పోర్టును ఎవరు కట్టారని ప్రశ్నించారు.

కర్నూల్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ కోసం 10 వేల ఎకరాలు ఇచ్చామని.. ఈ జిల్లాకు సీడ్ పార్క్ తెచ్చామని.. టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోలార్ పార్క్ తెస్తే కమిషన్ లు కోసం జగన్ రెడ్డి నిలిపివేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత అది సెట్ చేసుకుని మళ్లీ ప్రారంభించారన్నారు. అభివృద్ధికి టీడీపీ మారుపేరన్న చంద్రబాబు.. ప్రతి కార్యక్రమం ఇక్కడ టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు.

హైదరాబాద్ ఉన్న తెలంగాణ కంటే మనం అభివృద్ధి చెందాలని తాను అనుకున్నానని...అందుకే అమరావతి తలపెట్టానని.. కానీ.. ఈ రోజు రాష్ట్రానికి ఏమిటీ ఖర్మ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. యువతలో చైతన్యం రావాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నారు. అసలు ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఉంటుందా అని ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ మూడు ముక్కల ఆట ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు.

అప్పట్లో వైఎస్సార్ హైటెక్ సిటీ కూల్చివేసి ఉంటే తరువాత అభివృద్ధి జరిగేదా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కర్నూల్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు జగన్ నిలిపివేశారని.. జగన్ రెడ్డి తండ్రిని కూడా గౌరవించలేదని.. అయన తెచ్చిన వేమన యూనివర్సిటీ లో వేమన విగ్రహం తొలగించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూల్ లో పరిశ్రమలు రావాలని 10 వేల ఎకరాలలో టౌన్ షిప్ తెచ్చామని.. సోలార్ ప్రాజెక్ట్ లు తెచ్చి నాడు ఉపాధి కల్పించామని.. జగన్ కనీసం రాయలసీమ యూనివర్సిటీ లో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వడం లేదని చంద్రబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: