పవన్‌కు వెల్కమ్‌ చెబుతున్న డిఫ్యూటీ స్పీకర్‌?

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇవాళ విజయనగరం జిల్లా గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు పథకం అమలు తీరును పరిశీలిస్తారు. గుంకలాంలో 397 ఎకరాల్లో భారీ ఎత్తున ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. దీనికి గతంలో ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేసి, పైలాన్ ను కూడా  ఆవిష్కరించారు. అయితే.. పవన్ కల్యాణ్ విజయనగరం మండలం గుంకలాం లోని జగనన్న కాలనీ గృహనిర్మాణాలను పరిశీలిస్తామని చెప్పడాన్ని అక్కడి వైసీపీ నేత, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్వాగతించారు.

పవన్ కల్యాణ్ పర్యటనను మేము ఆహ్వానిస్తున్నామని.. అయితే ఈ ప్రాంతాన్ని రాజకీయ ఉనికి కోసం వాడుకోవద్దని కోరుతున్నామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో గుంకలాం జగన్న కాలనీలో జరుగుతున్న పనులను పరిశీలించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. ఇళ్ల నిర్మాణాల వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు.

గృహాల నిర్మాణం కోసం లేఅవుట్ లో ఏర్పాటు చేసిన రాక్రీట్ సంస్థ యూనిట్ ను అధికారులతో కలసి కోలగట్ల వీరభద్రస్వామి పరిశీలించారు. యూనిట్ పరిశీలన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కోలగట్ల మాట్లాడారు. రాష్ట్రంలోనే గుంకలాం లే అవుట్ అతి పెద్దదని... ఇక్కడ 12 వేల పైచిలుకు లబ్ధిదారులకు 394 ఎకరాలలో  లేఅవుట్ వేశామని కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఈ లేఅవుట్ లో నిర్మాణాలు జరగటం లేదని ఎవ్వరో తప్పుడు సమాచారం మేరకు పవన్ కల్యాణ్ ఇక్కడికి రావటం సరికాదని కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.

ప్రభుత్వం ఇక్కడ లబ్దిదారులకు 5 లక్షల రూపాయల విలువైన స్థలం ఇచ్చిందని.. ఇంటి నిర్మాణానికి లక్షన్నర ఇస్తామని ఆనాడే చెప్పామని... అంతేకాదు., ఇసుక, సిమెంటు, ఇనుమూ లబ్దిదారులకు అందుబాటులో ఉంచామని కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. నీటి కోసం 108 బోర్లు వేశామని.. కరెంట్ ఇచ్చామన.. రోడ్లు వేస్తున్నామని.. మొత్తం ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో రెండు వేల మంది కట్టుకుంటామన్నారని కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: