కేసీఆర్‌.. ప్రధాని మోదీని అవమానిస్తున్నారా?

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న సమయంలో ఆయన కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ రాకపోవడం చర్చనీయాంశం అవుతోంది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీఎం హాజరు కాకపోవడం విచారకరమని.. ప్రధాన మంత్రి తెలంగాణకు రావొద్దు అనడం సమజసం కాదని.. ఇది కేసీఆర్ రాజ్యంలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  అన్నారు.

కనీసం మహిళా అని చూడకుండా గవర్నర్ ను అడుగడుగున కల్వకుంట్ల కుటుంబం అవమానిస్తుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి .. గవర్నర్ కు ఇచ్చే ప్రోటోకాల్ ను కూడా ఇవ్వడం లేదన్నారు. మోదీ తెలంగాణకు రావద్దంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారని.. ప్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తున్నారని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో మనుగడలోని పార్టీలు మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాయని చెబుతున్నారని.. అసలు పార్లమెంట్ లో మీ బలమెంతా.. రామగుండం బంద్ కు పిలుపు ఇస్తారా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  నిలదీశారు.

తెలంగాణ నైతిక విలువల పట్ల ఎలాంటి ఆలోచన కేసీఆర్ కు లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి .. కేంద్రం సహాయ, సహకారాలు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారా అని నిలదీశారు. తెలంగాణ అభవృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఉందని.. మోదీ జవాబు చెప్పి రావాలని రెచ్చగొడుతున్నారని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  అన్నారు.

అసలైన రాజకీయ ఆట ఇప్పుడు ప్రారంభమైంది కేసీఆర్.. అంటూ సవాల్ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి .. కేసీఆర్ నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. అడుగడుగునా ప్రశ్నిస్తామని హెచ్చరిస్తున్నారు. మునుగొడులో ఓడి గెలిచామని.. ప్రజల ఆశీర్వాదం మాకు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  అంటున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కమ్యునిస్టు ప్రజా సంఘాలు ఎలా ఉండేవో ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచిస్తున్నారు. కమ్యునిస్టు పార్టీ ప్రజా సంఘాలను ఉక్కుపాదంతో అనిచివేసిన పార్టీతో జత కడతారా.. కమ్యునిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆలోచించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: