కిలో. రూ.3 మాత్రమే.. అయ్యయ్యె టమాటా రైతులు?

టమాటా ధరలు పడిపోయి మరోసారి రైతులు ఆగం అవుతున్నారు.  రైతులకు ఏటా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్న టమోటా పంట సాగు చేస్తూ తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు.  ప్రభుత్వం ధరల స్థిరీకరణ చేపడతామని హామీ ఇచ్చి ఇంతవరకు అలాంటి చర్యలేవి చేపట్టలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. కనీసం మద్దతు ధర కోసం టమోటా రైతులు మార్కెట్ కమిటీ అధికారులను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఆరుగాలం కష్టించి పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు మార్కెట్కు తరలిస్తే కనీస గిట్టుబాటు ధర కూడా లేక రైతులు వాటిని నేలపాలు చేస్తున్నారు. గుండె నిండా ఆవేదనతో ఇంటికి వెళుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో నిర్వహించే టమోటా మార్కెట్లో గత వారం రోజులుగా టమోటా ధరలు పూర్తిగా పతనమయ్యాయి . కిలో రెండు రూ.3  కూడా ధర పలకట్లేదు. కొనేవారు లేక రైతులు కష్టపడి మార్కెట్ కు తరలించిన పంట ఉత్పత్తులను నేలపై పారబోసి ఒట్టి చేతులతో వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

నాలుగు మూడు రోజులుగా ఈ ధరలు మరింత పడిపోవడంతో టమాటా రైతులు కుదేలవుతున్నారు.  రోజు మార్కెట్ కు భారీగా సరుకు తరలివస్తుండడంతో కొనేవారు లేక రైతులు వాటిని చూడలేక వీటిని తీసుకువెళ్లలేక పలువు రైతులు ఇక్కడే పశువులకు వరబోసి వెళ్తున్నారు . 30 కిలోల బాక్సు రూ.100 లోపే పలుకుతోంది. కోత కూలీలు కూడా చేతికందడం లేదంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.  టమోటా మార్కెట్లో మంగళ ధరలు కొంతమేర మెరుగుతున్నాయి. వ్యాపారులు ముందుకు వచ్చి 30 కిలోల బాక్సును రూ.110 నుంచి రూ. 150 దాకా కొనుగోలు చేస్తున్నారు.

ఈ ప్రాంతంలో టమోటా గుజ్జు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పాలకులు కొన్నేళ్లుగా చెబుతున్న ఇప్పటికీ ఆచరణకు నోచుకోవట్లేదు. అదే సమయంలో వినియోగదారుడికి మాత్రం ధర ఏమాత్రం తగ్గట్లేదు. మధ్య దళారీలే లాభపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: