EWS రిజర్వేషన్లు.. బీసీలు మళ్లీ కోర్టుకు?

దేశంలో అగ్రకులాల్లో పేదలకు రిజర్వేషన్లు అమలవుతాయని సుప్రీంకోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు విచారకరమంటున్నారు బీసీ నేతలు.  జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో మరోసారి సవాల్‌ చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య వెల్లడించారు.
భారతదేశంలో సామాజిక కోణంలో విద్యా రంగంలో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని మాత్రమే పేర్కొందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య గుర్తు చేశారు. కానీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎక్కడా చెప్పలేదని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య గుర్తు చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేవి పూర్తిగా రాజ్యాంగ మౌళిక సూత్రాలకు విరుద్ధం... ఇది రాజ్యంగపరంగా ఏ మాత్రం చెల్లుబాటు కాదని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య  చెప్పుకొచ్చారు.

గతంలో మండల్ కమిషన్ కేసు విచారణ సందర్భంగా 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం రిజర్వేషన్ల పరిమితి 50 శాతం విధించిందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు.  ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఈ గరిష్ట పరిమితి తొలగి 60 శాతంకు పెరిగిందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పుడు ఐదుగురు జడ్జీలు ఇచ్చిన తీర్పు గతంలో 9 మంది న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును ఎలా ఓవర్ టేక్ చేస్తారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు.

గతంలో సుప్రీంకోర్టు 13 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కేశావనంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చే అధికారం పార్లమెంట్‌కు లేదని తీర్పు ఇచ్చిందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య  గుర్తు చేశారు. తాజాగా ఈ తీర్పు ఇవ్వడం న్యాయ సంప్రదాయాలకే భిన్నం...  పైగా అగ్ర కులాల్లో పేదలకు ఆర్థికపరమైన పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేయాలి తప్ప విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య  వ్యాఖ్యానించారు. ఈ కేసుపై రివ్యూ పిటీషన్ వేయాలని నిర్ణయించిన దృష్ట్యా తక్షణమే ఈ కేసును లార్జర్ బెంచ్‌కు మార్చి 15 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సమీక్షించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య  సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ews

సంబంధిత వార్తలు: