జగన్‌.. పవన్‌కు చేతులారా ఆయుధం అందించారా?

ఇప్పటం.. ఇప్పుడు జనసేన చేతిలో కొత్త ఆయుధంగా మారుతోందా..  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. ఈ గ్రామంలో రోడ్ల విస్తరణ పేరిట ఇళ్లను కోల్పోయిన బాధితులకు పవన్ కల్యాణ్‌ సంఘీభావం తెలియజేయనున్నారు. ఇప్పటం గ్రామంలో జనసేన సభకు స్థలం ఇచ్చినందుకే కక్షగట్టారని ఇప్పటికే టాక్ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో మండిపడ్డారు కూడా.

ఎన్నికల్లో ఓట్లేయని వారిని కక్ష గట్టి వేధిస్తారా అని పవన్ కల్యాణ్‌ ప్రశ్నించారు. అంతే కాదు.. ఈ ప్రభుత్వాన్ని కూలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అసలేమైందంటే.. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్ల వెడల్పు పేరిట ఇళ్ల తొలగించటం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ గ్రామంలో రోడ్లను 120 అడుగుల మేర వెడల్పు చేసేందుకు ఇళ్లు తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  ఇంతకు ముందే నోటీసులు ఇవ్వటంతో పాటు మార్కింగ్ కూడా చేశామంటున్నారు.

కానీ.. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందునే కక్షగట్టి తమ ఇళ్లు తొలగించారని గ్రామస్థులు అంటున్నారు. తాము ఆందోళనకు దిగిన బాధితులకు జనసేన శ్రేణులు అండగా నిలిచారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. జనసేన సభకు స్థలం ఇచ్చినందుకే ఇలా చేశారని ఇప్పటం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇళ్లు కోల్పోతున్న వారిలో ఎక్కువమంది జనసేన వారేనట. ఇంకా మరికొందరు టీడీపీ వారట.

అసలు ఆర్టీసి బస్సు కూడా రాని గ్రామంలో 120 అడుగుల వెడల్పు రోడ్లు వేస్తామని చెప్పటం ఏంటని కొందరు గ్రామస్తులు ప్రశ్నించారు. ఇప్పుడు ఈ ఇష్యూని జనసేన హైలెట్ చేస్తోంది. పోలీస్ బలగాల సాయంతో జె.సి.బి.లతో నిర్ధాక్షిణ్యంగా కూల్చి వేస్తున్నారని ఆరోపిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామాన్ని సందర్శిస్తారు. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే అక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని  జనసేన నాయకులు ఫోకస్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: