గోరంట్ల మాధవ్‌ పై రాజకీయ కుట్ర జరిగిందా?

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. మొదట్లో అసలు ఈ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవా కాదా అన్న వ్యవహారం పై చర్చ జరిగింది. అయితే.. ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవేనని.. మార్ఫింగ్ ద్వారా అలాంటి వీడియో సృష్టించడం చాలా కష్టమన్న భావన నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అంత వరకూ ఓకే.. కానీ.. అసలు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది. ఈ వీడియో బయటకు రావడం వెనుక ఏమైనా రాజకీయ కుట్ర ఉందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.

గోరంట్ల న్యూడ్ వీడియోపై విచారణ జరిపిస్తామని ఇప్పటికే వైసీపీ సర్కారు చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ వీడియోను ఫోరెన్సిక్ నిపుణుల వద్దకు కూడా పంపారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామంటున్నారు. అయితే.. ఇందులో రాజకీయ కుట్ర ఉండొచ్చని వైసీపీ సర్కారు పెద్దలు అనుమానం వ్యక్తం చేసున్నారు. ఆ కుట్ర కూడా ఇప్పుడు బయటపెడతామంటున్నారు.

ఈ విషయంపై స్పందించిన హోంమంత్రి తానేటి వనిత.. ఆ వీడియో అసలో, కాదో.. అన్నదానిపై ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని, ఆ నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. తప్పు ఎవరు చేసినా, తన, మన అన్న తారతమ్యం లేకుండా, తప్పును తప్పుగానే చూస్తామని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఒకవేళ ప్రభుత్వంపై బురదజల్లేందుకు, రాజకీయ కుట్ర కోణంలో భాగంగా, ఇటువంటి చర్యకు ఎవరైనా పాల్పడినట్టు తేలితే.. వారిపైన కూడా చర్యలు ఉంటాయని హోంమంత్రి తానేటి వనిత చెప్పడం కూడా ఆసక్తి రేపుతోంది.

ఆ వీడియో వ్యవహారంలో బాధిత మహిళల ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న హోంమంత్రి తానేటి వనిత..  అయినా సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఎంపీ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని హోంమంత్రి తానేటి వనిత  చెప్పారు.  రాష్ట్రంలో మహిళలకు ఏ ఇబ్బందీ లేదన్న తానేటి వనిత...  మహిళలు ధైర్యంగా ఉండొచ్చు. ఏ ఇబ్బంది వచ్చినా.. మేము ఉన్నామని ముఖ్యమంత్రిగారు భరోసా ఇస్తున్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: