ఇక అలా చెల్లదు.. ముస్లింల విడాకులపై సంచలన తీర్పు?

ఓ ముస్లిం భర్త విడాకులు ఇవ్వాలంటే భార్యకు తలాక్‌ తలాక్‌ తలాక్‌ అని మూడు సార్లు చెబితే సరిపోతుందని ఆ మతం చెబుతోంది. అయితే.. కొందరు ఈ మూడు సార్లు తలాక్  చెప్పడాన్ని ఓకేసారి చెప్పేస్తున్నారు. విడాకులు అయిపోయాయంటున్నారు. కానీ ఇకపై అలా ఏకవాక్యంలో మూడుసార్లు తలాక్‌ చెల్లదని ఏపీ  హైకోర్టు తేల్చిచెప్పింది. అంతే కాదు.. అలా తలాక్‌నామా రాసుకున్నా చెల్లుబాటు కాదని చెప్పింది.

ఇటీవల ఓ కేసులో ఇలాంటి తీర్పు ఇచ్చిన ఏపీ హైకోర్టు.. భర్త నుంచి భరణం పొందేందుకు పిటిషనర్‌ అర్హురాలేనని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒకేసారి మూడు సార్లు తలాక్ చెప్పడం ఇస్లాం చట్ట నిబంధనలకు విరుద్ధం. అందుకే  ఏకవాక్యంలో మూడుసార్లు నోటిమాటగా తలాక్‌ చెప్పడానికి వీల్లేదు. అలాంటప్పుడు  దాన్ని తలాక్‌నామా రాసుకున్నా కూడా చెల్లదని ఏపీ హైకోర్టు చెప్పింది. అలాంటి తలాక్‌ నామాతో వివాహం రద్దు కాదని ఏపీ హైకోర్టు  స్పష్టం చేసింది.

ఇస్లాం చట్ట నిబంధనల ప్రకారం భార్యాభర్తలు తరఫున మధ్యవర్తులు వారి మధ్య సయోధ్య కుదర్చాలని  ఏపీ హైకోర్టు చెప్పింది. సయోధ్య సాధ్యపడనప్పుడు సరైన కారణాలతో వేర్వేరు సమయాల్లో మూడు తలాక్‌లు చెప్పాల్సి ఉంటుంది.  మూడు సందర్భాల్లో అవసరమైన సమయం అంటే టైమ్‌ గ్యాప్‌ కచ్చితంగా ఉండాలని  ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. అంతే కాదు.. తలాక్‌ చెప్పిన విషయాన్ని భర్త భార్యకు తెలియపరచాలని  ఏపీ హైకోర్టు తెలిపింది.

ముస్లిం విడాకుల కేసులో గతంలో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును  ఏపీ హైకోర్టు గుర్తు చేసింది. ఒకేసారి మూడు తలాక్‌లు చెప్పి వివాహం రద్దయిందనడం రాజ్యాంగ విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు షయారా బానో కేసులో తీర్పిచ్చింది. ఆ విషయాన్ని చెప్పిన  ఏపీ హైకోర్టు ప్రస్తుత కేసులో తలాక్‌నామాను రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపగా భార్య తిరస్కరించారని భర్త చెప్పడాన్ని ప్రస్తావించింది. ఇది తప్ప.. మరే ఇతర సాక్ష్యాలను చూపలేదని  ఏపీ హైకోర్టు గుర్తు చేసింది. ఏక వాక్యంలో మూడుసార్లు తలాక్‌ చెప్పడం దాన్ని రాతపూర్వకంగా పంపడం చెల్లదని  ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆమె భార్యగానే కొనసాగుతోందని.. భరణం పొందేందుకు అర్హురాలేనని స్పష్టం  ఏపీ హైకోర్టు  చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: