షాకింగ్‌.. ముంబయి నుంచి వాళ్లను వెళ్లగొడితే..?

రాజ్యాంగ బద్దమైన పదవుల‌లో ఉన్నవారు కాస్త ఆచి తూచి మాట్లాడటం నేర్చుకోకపోతే.. వారి పదవికే అప్రదిష్టంగా మారుతుంది. ఇప్పుడు మ‌హారాష్ట్ర గ‌వ‌ర్నర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారి కూడా అదే పని చేశారు.  ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఇంతకీ  మ‌హారాష్ట్ర గ‌వ‌ర్నర్ కోశ్యారీ ఏమన్నారంటే.. గుజ‌రాతీలు, రాజ‌స్థానీలు ముంబయి నుంచి వెళ్లిపోతే ఇక్కడి ప్రజల వద్ద డబ్బులే ఉండవట. మహారాష్ట్ర నుంచి ముఖ్యంగా ముంబయి, ఠానే నుంచి గుజరాతీలు, రాజస్థానీయులు వెళ్లిపోతే ఇక్కడి జనం దగ్గర డబ్బులు ఉండవట. అంతే కాదు.. వాళ్లు వెళ్లిపోతే ముంబయి ఆర్థిక రాజధానిగా కొనసాగలేదట.

ఇప్పుడీ మ‌హారాష్ట్ర గ‌వ‌ర్నర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారి వ్యాఖ్యలు వివాదంగా మారాయి.  మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలన్నీ గవర్నర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి. చివరకు సీఎం ఏక్‌నాథ్‌ శిందే కూడా గవర్నర్‌ వ్యాఖ్యలతో విభేదిస్తున్నట్లు ప్రకటించారు. ఇక గవర్నర్‌ కోశ్యారీ వ్యాఖ్యలను శివసేన అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కూడా తీవ్రంగా ఖండించారు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్నర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారి క్షమాపణలు చెప్పాలని ఠాక్రే డిమాండ్‌ చేశారు.

మ‌హారాష్ట్ర గ‌వ‌ర్నర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారి  వ్యాఖ్యలు ముంబయి, ఠానేలోని హిందువులను విభజించే చర్యగా ఠాక్రే ఆరోపించారు. మరాఠీ ప్రజలపై మ‌హారాష్ట్ర గ‌వ‌ర్నర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారి  తన మనసులో ఉన్న ద్వేషాన్ని బయటపెట్టారని ఠాక్రే విమర్శించారు. మూడేళ్లుగా మహారాష్ట్రలోనే ఉంటూ మ‌హారాష్ట్ర గ‌వ‌ర్నర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారి అనేక సార్లు  మరాఠీలను అవమానిస్తూనే ఉన్నారని ఠాక్రే అంటున్నారు. అటు కాంగ్రెస్‌ పార్టీ కూడా గవర్నర్‌ వ్యాఖ్యలను  ఖండించింది.

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే కూడా గవర్నర్‌ వ్యాఖ్యలను ఖండించారు. అయితే ఆ వ్యాఖ్యలు గవర్నర్ వ్యక్తిగతమని శిందే కామెంట్ చేసారు. గవర్నర్‌ ఇప్పటికే వివరణ ఇచ్చారని.. ఇకపై జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం శిందే సూచించారు. అయితే కోశ్యారీ మాత్రం తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారంటున్నారు. దీన్ని వివాదాస్పదం చేయొద్దని పార్టీలకు గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు. మరాఠీలను అవమానించే ఉద్దేశం తనకు లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: