కేసీఆర్‌కు మెడకు క్రమంగా బిగుస్తున్న ఈటల ఉచ్చు?

బీజేపీ నేత ఈటల రాజేందర్ క్రమంగా కేసీఆర్‌కు గుది బండగా మారుతున్నారు. కేసీఆర్‌ను ఓడించే వరకూ విశ్రమించేది లేదంటున్నారు. కేసీఆర్ ను ఓడగట్టకపోతే ఈ జన్మకు సార్ధకత లేదని చెబుతున్నారు. గజ్వేల్ లో పోటీ చేస్తా సిద్ధమా అని సవాలు విసిరితే బానిసలతో తిట్టిస్తున్నారని ఈటల అంటున్నారు. నేను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని సవాలు విసిరా... కేసీఆర్ కు దమ్ముంటే హుజురాబాద్ గడ్డపైన పోటీ చేయాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ చేస్తున్నారు.  

రాష్ట్రాన్ని పాలించే దమ్ము, ధైర్యం కేసీఆర్ కు లేదంటున్న బీజేపీ నేత ఈటల రాజేందర్.. విఆర్ఏ,విఆర్వో, పంచాయతీ కార్యదర్శుల ఉసురు కేసీఆర్ కు తగులుతుందన్నారు. కూట్లే రాయి తియ్యలేనోడు.. యెట్లే రాయి తీస్తాడా అంటూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ నేను ఇచ్చిన సవాల్ ను స్వీకరించలేక ఆయన బానిసతో అవమానకరంగా తిట్టించారని.. చెన్నూరు ఎమ్మెల్యే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు.

మా లాంటి వాళ్లను అవమానించడం తప్పితే ఆయన జాతి గురించి ఏనాడు పట్టించుకోలేదన్న బీజేపీ నేత ఈటల రాజేందర్.. ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తులు నా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గజ్వేల్ లో నేను తెరాసలో చేరినప్పుడు కార్పొరేటర్ అయితాననో.. ఎమ్మెల్యే అయితానని చేరలేదని.. నేను గజ్వేల్ లో తెరాసలో చేరినప్పుడు ఆ సీటు రిజర్వుడు.. కేసీఆర్ బానిసలు తెలుసుకోవాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ విసుర్లు విసిరారు.

నా ఉద్యమ పటిమ చూసి 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారన్న బీజేపీ నేత ఈటల రాజేందర్.. ఇప్పటికి నేను ఓటమి ఎరుగలేదని.. 2018ఎన్నికల ముందే నన్ను ఓడించాలని కుట్రలు పన్నారని.. నాతో పాటు మరో ముగ్గురిని ఓడించేందుకే కుట్ర పన్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ బయటపెట్టారు. నేను ఏమీ తప్పు చేశానని మంత్రి పదవిలో నుంచి తొలగించావు కేసీఆర్ అని ప్రశ్నించిన బీజేపీ నేత ఈటల రాజేందర్... నేను ఆర్ధిక, వైద్య శాఖ మంత్రిగా పని చేయలేదా అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: