ఎన్నికల కోసం అదిరే ప్లాన్ రెడీ చేసిన జగన్? E

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి.. మళ్లీ గెలిస్తే..ఇక ఈసారి టీడీపీ అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయం.. ఇదీ జగన్ ఆలోచన. అందుకు తగ్గట్టుగానే ప్లాన్‌ రెడీ చేసుకుంటున్నాడు సీఎం జగన్. ఇటీవల తరచూ పార్టీ నేతలతో సమావేశం అవుతున్న సీఎం జగన్.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే క్షేత్రస్థాయిలో మంచి వాతావరణ ఉండాలి. పల్లెల్లో పార్టీ గురించి మంచి అభిప్రాయం ఉండాలి. ప్రత్యేకించి పల్లెల్లో తమ వసతులు బావుండాలి.

అందుకే పార్టీని గ్రామం నుంచి బలపరిచే వ్యూహాన్ని జగన్ రెడీ చేస్తున్నారు. అందుకే కచ్చితంగా నెలలో 6 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం జరిగేలా చూడాలని ఇటీవల సీఎం జగన్ పార్టీ నేతలకు హుకుం జారీ చేశారు. ప్రతి సచివాలయంలో ప్రాధాన్య పనులకోసం రూ.20లక్షలు ఇవ్వబోతున్నామని సీఎం జగన్ పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. సక్రమంగా ఆ పనులు జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యతకూడా నేతలపై ఉందంటున్న జగన్.. ప్రతి నెలకు ఒక్కో నియోజకవర్గానికి దాదాపు రూ.1.20 కోట్లు పనులు ఇస్తున్నామని తెలిపారు.

పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లా కమిటీలు, మండల కమిటీలు, నగర కమిటీలు అన్నీ అనుకున్న సమయానికి పూర్తి కావాలని జగన్ ప్లాన్‌ చేస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తి కావాలని తలపోస్తున్నారు. ఇప్పటి నుంచే బూత్‌ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించాలని పార్టీ వర్గాలకు సూచిస్తున్నారు. అన్నిరకాల కమిటీల్లో  అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.

అంతే కాదు.. వచ్చే ఆగస్టు నుంచి సీఎం జగన్ మరింతగా పార్టీపై దృష్టి పెట్టబోతున్నారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతానని సీఎం జగన్ ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రణాళికను జగన్ టీమ్ రెడీ చేస్తోంది. త్వరలో దీని వివరాలను సీఎం జగన్ టీమ్‌ వెల్లడించే అవకాశం ఉంది. మొత్తానికి వచ్చే ఎన్నికల కోసం జగన్ ఇప్పటి నుంచే పక్కాగా ప్లాన్ రెడీ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: