జగన్‌.. సొంతంగా 5 నిమిషాలు కూడా మాట్లాడలేడా?

ఏపీ సీఎం జగన్ సొంతంగా ఏమీ మాట్లాడలేరని.. అల్లూరి సీతారామరాజు గురించి పట్టుమని ఐదు నిమిషాలు మాట్లాడాలి లేని వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని టీడీపీ విమర్శిస్తోంది. సీతారామరాజుకి జై అనడానికి కూడా పేపర్ చూడడంతో.. అల్లూరి సీతారామరాజు గురించి ముఖ్యమంత్రికి ఉన్న జ్ఞానం అర్థమవుతుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు.  కాగితంలో రాసిన ఒక్కొక్క పదాన్ని చూసి చదవడం తప్ప అల్లూరి గురించి తెలియదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు.

రాష్ట్రంలో స్వతంత్ర సమరయోధుల్లో మొట్టమొదటిగా చెప్పుకునే వ్యక్తుల్లో అల్లూరి సీతారామరాజు ఉంటారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. అలాంటి  స్వతంత్ర సమరయోధుడు గురించి మాట్లాడం కూడా జగన్‌కు  తెలియదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. ఆరో తరగతి చదివే చిన్న పిల్లవాడిని అడిగినా అల్లూరి సీతారామరాజు గురించి చెబుతారని ఆయన ఎద్దేవా చేశారు. తల్లి, చెల్లి అనే భావన లేకుండా పదవి వ్యామోహం తప్ప వేరే ఆలోచన ముఖ్యమంత్రికి లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు.

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని ఇంటూరు గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మంచి పనులు,  కార్యక్రమాలు చూసి పలువురు ఇటీవల పార్టీలో చేరినట్లు ఆనందబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మన వాడు, నా వాడు అంటూ దళితులు ఓట్లు వేశారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు  అన్నారు.. కానీ.. అసలు ముఖ్యమంత్రి ఏ వర్గానికి చెందిన వారో తెలియడం లేదన్నారు.

జగన్ ఎంతవరకూ హిందువు.. ఎంతవరకు క్రైస్తవుడో ఆలోచన చేయాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సూచించారు. ముఖ్యమంత్రి విశాఖపట్నం స్వరూపానంద స్వామికి ప్రాధాన్యం ఇస్తారని.. ఇక్కడ ఓట్లు సమయంలో మాత్రం తన తల్లికి బైబిలు ఇచ్చి పంపుతాడని... రకరకాల నాటకాలు వేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. తాను నిజంగా క్రైస్తవుడు అయితే ధైర్యంగా చెప్పాలని హిందువు అయితే ఒప్పుకోవాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సవాల్ విసిరారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: