ఆ నలుగురిని జగన్.. అస్సలు వదలట్లేదుగా?

ఏపీ సీఎం జగన్.. తన ప్రత్యర్థిగా ఇప్పుడు టీడీపీని భావించట్లేదు.. ఎల్లో మీడియాగా పేరు పడిన నాలుగు మీడియా సంస్థలే తన అసలైన ప్రత్యర్థులు అని చెప్పుకుంటున్నారు. ఎక్కడ ఛాన్స్ వచ్చినా.. ఏమాత్రం అవకాశం వచ్చినా.. ఆ నలుగురిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అది ఏ వేదిక అయినా.. ఏ సభ అయినా.. ఏ సమావేశం అయినా.. జనం కనిపిస్తే చాలు.. ఆ నలుగురికిని జగన్ ఏకిపారేస్తున్నారు.

ఇంతకీ ఆ నలుగురు ఎవరు అంటారా.. వారే.. జగన్ పేర్కొంటున్న దుష్ట చతుష్టయం రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. ఆ తర్వాతే చంద్రబాబు... తన ప్రభుత్వంపై రోజూ విమర్శలు చేసే చంద్రబాబు, దుష్ట చతుష్టయంలోని రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు ఇటువంటి నిజాలు ఏనాడైనా చెప్పే ధైర్యం, నిబద్ధత వీరికి ఉందా అని సీఎం జగన్ ప్రశ్నిస్తున్నారు. నిన్న అమ్మఒడి కార్యక్రమంలోనూ జగన్ ఇవే విమర్శలు చేశారు. బైజూస్‌యాప్‌ ద్వారా వీడియోలు, యానిమేషన్‌బొమ్మలతో 4వ తరగతి నుంచి మరింత సులభంగా, సమగ్రంగా పాఠ్యాంశాలు అర్థమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నా.. వీరు విమర్శిస్తున్నారని జగన్ మండిపడ్డారు.

సీబీఎస్‌ఈతో అనుసంధానించిన బైజూస్‌ కంటెంట్‌ వచ్చే ఏడాది నుంచి అందించబోతున్నామని.. . ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు 4.7 లక్షల మందికి రూ.500 కోట్లతో ట్యాబ్‌లను ఉచితంగా ఇస్తోందని.. కానీ.. అమ్మఒడిలో రూ.2 వేలు మినహాయించుకుంటున్నారని కొందరు విమర్శలు చేయడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తోందని జగన్ అన్నారు. ఇలా విమర్శలు చేసే ఏ ఒక్కరైనా కూడా వారి జీవితంలో చదివించే అమ్మకు ఒక్క రూపాయి అయినా అమ్మలకు ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు.

ఇలాంటి స్కీమ్‌లు పెట్టాలని ఏనాడు ఆలోచన చేయని వారు ఇలా విమర్శలు చేయడం ఎంతవరకు న్యాయమని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు యుద్ధం నేరుగా జరగడం లేదని.. కుయుక్తులు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నారని.. తన ప్రభుత్వం చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ దుష్ట చతుష్టంతో యుద్ధం చేస్తోందని.. వీరికి మరో దత్త పుత్రుడు కూడా ఉన్నాడని జగన్ మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: