
ఆ జిల్లాలో.. అదిరిపోయే ఆఫర్ ఇస్తున్న జగనన్న?
ఇంటి నిర్మాణానికి మెప్మా ద్వారా రుణాలు ఇప్పిస్తున్నామని.. వినుకొండలో 3వేల ఇల్లు కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వేం 3 నుంచి 4 లక్షల విలువచేసే స్థలం ప్రభుత్వం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 1.80 లక్షలు మంజూరు చేసిందని... లబ్ధిదారుని వాటా కింద 50 వేల నుంచి 1లక్ష రూపాయలు వెచ్చించి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. బ్రాహ్మణపల్లి రెవిన్యూ వెంకుపాలెం వద్దగల 120 ఎకరాల జగనన్న లేఅవుట్ సిద్ధమవుతోంది.
జగనన్న కాలనీల జియో ట్యాగింగ్ లెవెల్లో జిల్లా ముందంజలో ఉందని అధికారులు చెబుతున్నారు. వెంటనే పునాదులు తీయించి నిర్మాణాలను వేగవంతం చేయాలంటున్నారు. వినుకొండ జగనన్న అర్బన్ లేఅవుట్ కొండ పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. ఇక్కడ 5600 మంది లబ్ధిదారులు ఉంటే ప్రస్తుతానికి 800 మంది గ్రౌండింగ్ జరిగింది. వినుకొండ అర్బన్ హౌసింగ్ లేఅవుట్ ఆదర్శంగా గురజాల, నరసరావుపేట లో ఇంటి నిర్మాణాలు చేపట్టనున్నారు. 3 వేల ఇల్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ముగ్గురు కాంట్రాక్టర్లను నియమించారు. ఒక్కొక్కరికి వెయ్యి ఇల్లు చొప్పున కాంట్రాక్టర్ అప్పగిస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చే 1.80 లక్షల తో పాటు లబ్ధిదారులు వాటా కింద మరో లక్ష రూపాయలు వెచ్చించి నిర్మించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయకుండా మెప్మా ద్వారా బ్యాంకులో రుణాలు ఇప్పిస్తున్నామంటున్నారు.