కీలక ప్రాంతం రష్యా స్వాధీనం.. ఉక్రెయిన్‌కు చుక్కలే?

ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా మరో ముందడుగు వేసింది.. కీలకమైన డాన్ బాస్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించుకుంది. దీంతో రష్యా సైన్యం మొత్తం లుహాన్స్క్ ప్రావిన్స్ ను దాదాపుగా ఆక్రమించుకున్నట్టే అయ్యింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రి స్వయంగా వెల్లడించారు.  డాన్ బాస్ లోని రెండు ప్రావిన్సుల్లో  ఒకటైన  లుహాన్స్క్  97 శాతం తమ ఆధినంలోకి వచ్చిందనీ రష్యా రక్షణ మంత్రి ప్రకటించారు. అలాగే డొనెట్స్క్ సైతం సగం మేర తమ చేతుల్లోనే ఉందని ఆయన ప్రకటించారు.

ఇక ఈ డాన్‌ బాస్‌ ప్రత్యేకత ఏంటంటే... 2014 నుంచి ఈ డాన్ బాస్ ప్రాంతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వేర్పాటువాదులు గళం విప్పుతున్నారు. వారికి అప్పటి నుంచి రష్యా అండదండలందిస్తోంది. ఇక ఇప్పుడు ఈ ప్రాంతం పై రష్యా పట్టుసాధించడంతో వేర్పాటు వాదులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా డాన్ బాస్ ప్రాంతం రష్యా దాడులతో అల్లాడిపోతోంది.

ఒక్కో కీలక ప్రాతం చేజారుతున్నా.. ఉక్రెయిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీనికి ఉక్రెయిన్, రష్యా మధ్య మరింత పెట్రోల్‌ పోస్తున్న అమెరికా వంటి దేశాలు కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో రష్యా ఎంతగా దాడులు చేస్తున్నా ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఉక్రెయిన్‌ ఇంకా తన పోరు కొనసాగించే అవకాశమే పుష్కలంగా కనిపిస్తోంది. నగరాలకు నగరాలే శిథిలం అవుతున్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.

మరి ఆయనకు ఎందుకు ఇంత పట్టుదల.. రష్యా వంటి దేశంతో తలపడలేనని తెలిసినా ఎందుకు యుద్ధం కొనసాగిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం అమెరికా రూపంలో కనిపిస్తోంది. ఉక్రెయిన్ వెనుక ఉండి.. అమెరికానే యుద్ధం సాగిస్తోందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌ను వెనుక నుంచి నడిపిస్తున్న అమెరికా ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం మరింతగా పెంచుతోంది. అత్యాధునిక ఆయుధాలు అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: