రహస్యం: జగన్.. ఈ దోపిడీ నిజమేనా?


ఏపీ సీఎం జగన్ కేంద్రం నిధులు రాష్ట్రం కోసం వాడుకుంటున్నారా.. ప్రత్యేకించి గ్రామాల కోసం కేంద్రం అందిస్తున్న నిధులను జగన్ దోపిడీ చేస్తూ పక్కదారి పట్టిస్తున్నారని గ్రామ సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. గ్రామానికి సేవ చేద్దామని ఎన్నో ఆశలతో ఆశయాలతో ఎన్నికైన తాము సర్పంచులుగా ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని సర్పంచుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులు ఇవ్వవలసిన నిధులు, విధులు, అధికారాలను ఇవ్వట్లేదని..పైగా  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్ధిక సంఘం కేటాయించిన 7,660 కోట్లు నిధులు దారి మళ్లించారని వారు ఆరోపిస్తున్నారు.

తాజాగా విజయవాడలో జరిగిన ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్  రాష్ట్ర కమిటీ సమావేశంలో సర్పంచ్‌లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి 26 జిల్లాల పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘాలకు చెందిన రాష్ట్ర కమిటీ నాయకులు వచ్చారు. సర్పంచ్ లకి, ఎంపిటిసిలకు గౌరవ వేతనం మూడువేల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలిసిందే. చివరకు గ్రామ  వాలంటీర్‌కు ఇచ్చే జీతం కూడా సర్పంచులకు రాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాదు.. స్థానిక  సంస్థల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిందని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. తమ నిధులను తిరిగి తమకు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆరు నెలల క్రితం ఈ నిధుల కోసం బిక్షాటన కూడా చేశామని వారు అంటున్నారు. గతంలోనే కలెక్టర్ ని కలిసి మెమోరండం అందజేశామని.. కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని వారు ఆరోపిస్తున్నారు.

గ్రామ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కేంద్రం నిధులిస్తే.. జగన్ సర్కారు వాటిని కూడా పక్కదారి పట్టిస్తోందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. సర్పంచులకు, జడ్పిటిసి లకు తెలియకుండా ఖాతాలో జమ పడిన నిధులను ప్రభుత్వము  సొంత పథకాల కోసం వాడుకుంటుందని సర్పంచులు ధ్వజ మెత్తారు. కేంద్రం ఇచ్చిన నిధులను ప్రభుత్వం దారి మళ్లించడం పై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తామంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: