రైతుల కోసం జగన్ సర్కారు కొత్త ఐడియా?

ఏపీ సీఎం జగన్ ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. సన్న, చిన్నకారు రైతులకు ట్రాక్టర్లు, ఇతర యంత్రపరికరాలను రాయితీపై అందించే వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని సీఎం జగన్ గుంటూరు జిల్లాలో ప్రారంభిస్తారు. అలాగే గుంటూరు శివార్లలో జిందాల్ సంస్థ రూ.340కోట్లతో నిర్మించిన చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంటును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. జగన్ ప్రభుత్వం రైతులకు తక్కువ అద్దెతో వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులోకి తెచ్చేందుు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఈ వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని రూపొందించింది.

ఆర్బీకేల పరిథిలో కమ్యూనిటి హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఈ యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచుతారు. ఇప్పటి వరకూ చిన్నపరికరాలే ఈ సీ హెచ్ సి లలో ఉంచేవారు ఇప్పుడు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు కూడా హైరింగ్‌ పరిధిలోకి తెచ్చారు. ఇవాళ జగన్ రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణి చేస్తారు.  రైతు సంఘాలకు వీటిని అందిస్తారు. ఈ రైతు సంఘాలు 10శాతం ఖర్చు భరిస్తాయి. మరో  40శాతం రాయితీ ఉంటుంది. మిగిలిన  50శాతం డిసిసిబిల ద్వారా రుణం రూపంలో అందిస్తారు.

ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం 16కంపెనీల నుంచి 3వేల 800 ట్రాక్టర్లు కొనుగోలు చేసింది. రైతు సంఘాలు కోరికమేరకు వారు కోరిన ట్రాక్టర్, వారు కావాలనుకున్న సౌకర్యాలతో అందిస్తారు. ఒక్కో ట్రాక్టర్ ధర మోడల్ ను బట్టి రూ.7లక్షల నుంచి 8లక్షల వరకూ ఖరీదు చేస్తుంది. ప్రస్తుతం  ఈ వాహనాలను గుంటూరు మిర్చి యార్డులో ఉంచారు. చుట్టుగుంటలో ముఖ్యమంత్రి ఇవాళ  వీటిని రైతులకు అందజేస్తారు.

ఇవాళ సీఎం జగన్ వాహనాలు పంపిణి చేయటంతో పాటు మొత్తం 5, 262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రాయితీను కూడా బదిలీ చేస్తారు. మొత్తం రూ. 175.61 కోట్ల రాయితీని ముఖ్యమంత్రి సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ప్రభుత్వం అందించే ఈ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఆర్బీకేల పరిధిలో రైతులకు అందుబాటులో ఉంటాయి. రైతులు ఇకపై తక్కువ అద్దెతో వ్యవసాయ పనులకు వీటిని వాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: