కార్ కోసం.. పాక్ క్రికెటర్ తో గొడవ జరిగింది : రవి శాస్త్రి

praveen
భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టి మొత్తం ఆ మ్యాచ్ మీదే ఉంటుంది . ఇకపోతే ఇప్పుడు వరకు అంతర్జాతీయ వేదికలలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ప్రతిసారి కూడా టీమిండియా పైచేయి సాధిస్తూ వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇక ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాల పై నిషేధం ఉన్న నేపథ్యంలో వరల్డ్ కప్ లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మరింత హై ఓల్టేజీ మ్యాచ్ గా మారిపోతూ ఉంటుంది.

 అయితే భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సమయంలో కొన్నిసార్లు ఆటగాళ్ల మధ్య ఆసక్తికర గొడవలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే   1985లో పాకిస్తాన్ పై గెలిచి ప్రపంచ చాంపియన్షిప్ ను సొంతం చేసుకుంది టీమిండియా. ఈ విషయాన్ని ఇప్పటికీ కూడా క్రికెట్ ప్రేక్షకులు మరిచిపోలేరు. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత జట్టు పాకిస్థాన్ ను ఓడించి కప్ ఎగరేసుకుపోయింది. ఈ సీజన్లో రవిశాస్త్రి ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచాడు.

 కీలక సమయంలో ఒక వికెట్ పడగొట్టడమే కాదు బ్యాటింగ్లో 63 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా నిలిచాడు రవి శాస్త్రి.  ఇక ఇందుకుగానూ ఆడి కారును సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఫైనల్ లో గెలుపొందిన సమయంలో రవిశాస్త్రి ఆడి కారు డ్రైవ్ చేస్తూ ఉండగా దాని పై కూర్చుని సంబరాలు చేసుకున్నారు టీమిండియా ఆటగాళ్లు. ఇకపోతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అప్పుడు ఫైనల్ సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ జావేద్ మియాందాద్ తనపై స్లెడ్జింగ్ పాల్పడ్డాడని గుర్తుచేసుకున్నాడు. జావేద్ మియాందాద్ నా వైపు వచ్చి నువ్వు మళ్లీ మళ్లీ అక్కడ ఏం చూస్తున్నావ్.. కారును ఎందుకు చూస్తున్నావ్.. అది నీకు దక్కదు నాకే దక్కుతుంది  అంటూ స్లెడ్జింగ్ కీ పాల్పడ్డాడు. కౌంటర్ గా.. కారును నేను చూడలేదు.. కార్ నన్ను చూస్తుంది.. మా ఇంటికి రావడానికి సిద్ధమయ్యింది అంటూ నోరు మూయించ అని రవిశాస్త్రి తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: