కుల రాజకీయం.. జనసేన ఏమంటోందంటే?

ఏపీలో కుల రాజకీయాలు కొత్త కాదు.. అయితే.. కోనసీమలో గొడవలతో మరోసారి ఏపీ కుల రాజకీయాలు చర్చకు వచ్చాయి. దీనిపై చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ చాలా సుదీర్ఘంగా తన అభిప్రాయాలు వెల్లడించారు. భారతదేశ రాజకీయాలు కులాలతో ముడిపడి ఉన్నాయంటున్న పవన్ కల్యాణ్.. కులాల్ని విభజించి పాలించే పార్టీల్లో వైసీపీ గురించి ముందుగా చెప్పుకోవాలని సైటెర్‌ విసురుతున్నారు.

కుల నిర్మూలన జరగాలని అంబేద్కర్ ప్రతిపాదించారన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కులాల ఐక్యతతోనే అది సాధ్యమంటున్నారు. కుల రాజకీయాలు చేయకూడదు, ఆంధ్ర ప్రదేశ్ బాగుండాలని మేం కోరుకుంటున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అభిప్రాయం చెప్పారు. వైసీపీ కోనసీమ అల్లర్లు సృష్టించిన విధానం చాలా బాధాకరమన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇది బహుజన సిద్ధాంతం  పై జరిగిన ధాడిగా చూడాలని సూచించారు.

ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు కులాల ఘర్షణగా మారి రంగా హత్య జరిగి విజయవాడ తగలబడిందని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అవినీతిని మన దేశంలో సాధారణమైన అంశంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతితో అధికారంలోకి వచ్చిన వారు లంచం తీసుకున్న వారిని శిక్షిస్తామని చెప్పటం హాస్యాస్పదమని ఇండైరెక్టుగా జగన్‌ పై సెటైర్లు వేశారు. అవినీతి వ్యవహారాలు చూస్తూ అందరం మౌనంగా కూర్చున్నామని.. ఇలాంటి సమయంలో వైసీపీ చాలా తెలివిగా కోనసీమ గొడవలు రేపిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

కుల సమీకరణల కోసమే వైసీపీ కుట్రకు తెరలేపిందంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీసీలపై కక్షతోనే గొడవలు సృష్టించారన్నారు. కాపులు అందరూ జనసేన కు ఓట్లు వేస్తే మేం గెలిచే వాళ్ల కదా అని లాజిక్‌ తో ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... అన్ని కులాలు ఓట్లు వేశారు కాబట్టే వైకాపా గెలిచిందని అంటున్నారు. కమ్మ వాళ్లు ఓట్లు వేయకపోతే అమరావతి ప్రాంతంలో వైసీపీ గెలిచేదా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: